ఛాక్లెట్ గర్ల్ జెనీలియా
2003లో సూపర్ హిట్ మూవీ 'నువ్వేకావాలి" హిందీ రీమేక్ 'తుజే మేరీ కసమ్" చిత్రరంగంలోకి అడుగుపెట్టిన జెనీలియా, సంచలన దర్శకుడు శంకర్ 'బాయ్స్" సినిమాతో వెలుగులోకి వచ్చింది. అదే సంవత్సరం 'సత్యం" సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన జెనీలియా ఆ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు హీరోయిన్‌గా స్థిరపడింది. అడపదడపా తమిళం, ఓ కన్నడ సినిమాలో కూడా నటించిన చాక్లెట్‌పాప ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుకుంటుంది. తొలి చిత్రం 'తుజే మేరీ కసమ్"తో బాలీవుడ్‌లో అంతగా గుర్తింపురాలేదు. ఆ తరువాత తెలుగు సినిమాలమీదనే దృష్టిపెట్టింది.
మళ్ళీ 2008లో 'మేరీ బాప్ పెహెలే ఆప్" చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే రిలీజ్ అయిన 'జానేతూ యా జానే న" సినిమా హిట్‌కావడంతో బాలీవుడ్‌లో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఫర్దీన్ ఖాన్ సరసన జెనీలియా హీరోయిన్‌గా నటించిన 'లైఫ్ పార్టనర్" సినిమా ఇటీవలే విడుదలై విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమాలో ఇంకా గోవిందా, తుషార్ కపూర్, ప్రాచీ దేశాయ్ కూడా నటించారు. బాలీవుడ్‌లో ఇప్పటికే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న జెనీలియా నటిస్తోన్న 'హుక్ యా క్రూక్", 'యాహూ" లాంటి సినిమాలు షూటింగ్ దశలో ఉండటం విశేషం. ఈ సినిమాలు కూడా విజయాన్ని నమోదు చేసుకుంటే జెనీలియా టాప్ లిస్ట్‌లోకి దూసుకుపోవడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో తెగ బిజీ అయిపోయిన 'హాసిని" తెలుగు సినిమాలవైపు చూడటంలేదనుకుంటున్న తరుణంలో...త్వరలో 'కథ" అనే సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమనబోతోంది జెనీలియా.
వివాహం అనే అంశాన్ని తీసుకొని నిర్మించిన 'లైఫ్ పార్టనర్" చిత్రంలో ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే యువకుని పాత్రలో ఫర్దీన్ ఖాన్ నటించాడు. ఫర్దీన్ ప్రేమించే యువతి పాత్రలో జెనీలియా నటించింది. ఇంకా ఈ సినిమాలో గోవిందా, తుషార్ కపూర్, ప్రాచీ దేశాయ్ నటించారు. పెళ్ళి, జీవిత భాగస్వామి పట్ల వీరందరికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలాగే సంజన పాత్రలో నటించిన జెనీలియాకు కూడా పెళ్ళి, లైఫ్ పార్టనర్ విషయంలో కొన్ని అభిప్రాయాలుంటాయి.
'కరకరా కొరుక్కు తినేయాలినిపిస్తోంది.' ఇది జెనీలియా నటించిన ఓ కమర్షియల్ యాడ్‌లోని డైలాగ్. కానీ దీనికి భిన్నంగా... జెనీలియానే కొరుక్కు తినేలా ఉదంటున్నాడు ఓ రచయిత. ''ప్రంపంచలోకెల్ల బెస్ట్ చాక్‌లెట్ తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో జెనీలియాను చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతుంది..."" ఈ మాటలన్నది ఏ బాలీవుడ్ అభిమానో, నటుడోకాదు. ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత చేతన్ భగత్. 'ఫైవ్ పాయింట్ సమ్‌వన్", 'వాట్ నాట్ టూ డూ ఎట్ ఐఐటీ", 'వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్", 'ద త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్" లాంటి అనేక ఎన్నో ఫేమస్ నవలలు రాసిన ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఇప్పుడు జెనీలియాకు వీరాభిమానిగా మారిపోయాడు ''జెనీలియా నటించిన 'లైఫ్ పార్టనర్" సినిమా చూశాను. అందులో ఎంతో క్యూట్‌గా, చాలా అందంగా ఉందామె. జెనీలియా లాంటి అందగత్తెలను దేవుడు ఎలా సృష్టిస్తాడో? ఆమె నిజంగా గొప్ప అందగత్తే."" అంటూ ఈ బాలీవుడ్ బబ్లీ గాళ్ అందాన్ని తెగపొగిడేస్తున్నాడు. చేతన్ భగత్ రాసిన 'వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్" నవల ఆధారంగా ఒక సినిమా కూడా వచ్చింది. అతుల్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన 'హలో" చిత్రం ఈ నవల ఆధారంగా తీసిందే. ఐఐటీ విద్యార్థుల జీవితంపై రాసిన మరో నవల 'ఫైవ్ పాయింట్ సమ్‌వన్" కూడా 'త్రీ ఈడియట్స్" పేరుతో సినిమాగా రాబోతోంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. అంత గొప్ప రచయిత నుండి కితాబు రావడంతో జెనీలియా ఉబ్బితబ్బిబైపోవడం ఖాయం అంటున్నారు సినీజనాలు.


Click it and Unblock the Notifications











