»   » బాలకృష్ణపై ఆ వీడియోలన్నీ తప్పు, చిరు మూవీ అంటే ఫోన్ పెట్టేయమన్నా: అనీ మాస్టర్

బాలకృష్ణపై ఆ వీడియోలన్నీ తప్పు, చిరు మూవీ అంటే ఫోన్ పెట్టేయమన్నా: అనీ మాస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీలో లేడీ కొరియోగ్రాఫర్లంటే కాస్త వివక్ష ఉంది. లేడీ కొరియోగ్రాఫర్లకు హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ ఇవ్వడం లేదు. వారికి కేవలం ఫ్యామిలీ సాంగ్, రొమాంటిక్ సాంగ్, మ్యారేజ్ ఓరియెంటెడ్ సాంగ్ ఇలా మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. కానీ పూరిగారు 'పైసా వసూల్' చిత్రానికి నాకు తొలిసారిగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇచ్చారు. ఆసాంగ్ మంచి హిట్టయింది. ఆయన నాపై నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది అని... లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ అన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనీ మాస్టర్ మాట్లాడుతూ... బాలకృష్ణ సార్ అంటే ముందే భయం. నేను అసిస్టెంట్ గా కూడా ఆయన సినిమాలకు పని చేయలేదు. కానీ ఆయనతో పని చేశాక తెలిసింది ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎంత బావుంటుందో. ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఒక్కసారి కూడా ఆయన ఈ స్టెప్ చేంజ్ చేయ్ అని చెప్పలేదు. రిహార్సల్‌లో కూడా చాలా హెవీగా చేశారు. ఆయనతో చేయలేక కొన్నిసార్లు నేనే అలసిపోయాను అని అనీ మాస్టర్ చెప్పుకొచ్చారు.

బాలయ్య చాలా గౌరవం ఇస్తారు

బాలయ్య చాలా గౌరవం ఇస్తారు

బాలకృష్ణ గారు మాస్టర్స్‌కు చాలా గౌరవం ఇస్తారు. సెట్‌కి రాగానే ముందు మాస్టర్ ఎక్కడ అని వెతుకుతారు. చూసిన తర్వాత నృత్య వందనం చేసి, షేక్ హ్యాండ్ చేసిన తర్వాత టేక్‌కి వెళతారు. ప్యాకప్ అయిన తర్వాత కూడా మాస్టర్ ఎక్కడ అని వెతుకుతారు, పిలిపిస్తారు... మళ్లీ నమస్కారం చేసి వెళ్లిపోతారని అనీ మాస్టర్ తెలిపారు.

బాలకృష్ణ గారి మీద వచ్చిన వీడియోస్ అన్నీ తప్పు...

బాలకృష్ణ గారి మీద వచ్చిన వీడియోస్ అన్నీ తప్పు...

బాలకృష్ణ గారి గురించి చాలా వీడియోలు వచ్చాయి. అదంతా తప్పు. బ్యాగ్రౌండ్ ఏమీలేని మా లాంటి సినిమా వాళ్లకే చాలా పొగరు ఉంటే...ఆయన బార్న్ విత్ సిల్వర్ స్పూన్, సినిమా కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనలో నేను కోపం ఎప్పుడూ చూడలేదు. నేను బయట విన్న దానికి, ఆయనతో వర్క్ చేసిన దానికి చాలా తేడా ఉంది. ఆయన గురించి విన్నదంతా తప్పని అర్థమైందని అనీ మాస్టర్ చెప్పుకొచ్చారు.

ఆ ఏజ్ లో కూడా...

ఆ ఏజ్ లో కూడా...

బాలకృష్ణ గారి ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ... ఆయన ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, చాలా ఎనర్జిటిక్‌గా రిహార్సల్స్, టేక్స్ చేశారు. బాలకృష్ణ గారితో పని చేయడం చాలా గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.... అన్నారు.

వివక్ష ఉంది...

వివక్ష ఉంది...

ఇలాంటివి చెప్పుకోవద్దు కానీ ఇండస్ట్రీలో లేడీ మాస్టర్లపై కొంత వివక్ష ఉంది. షూటింగ్ జరిగేపుడు 40 మంది డాన్సర్లు ఉంటే అందులో 20 మంది మాత్రమే నృత్య వందనం చేస్తారు. మిగతా వారు అసలు చేయరు. అదే మేల్ మాస్టర్ ఉంటే సచ్చినట్లు వచ్చి చేస్తారు. కానీ బాలయ్య గారి వద్ద మాత్రం అలాంటిది కనిపించలేదు. ఆయన సెట్స్ కు రాగానే, మళ్లీ వెళ్లేపుడు నమస్కార్ చేయడం, ఆయనలో క్రమశిక్షణ చూసి నేనే ఆశ్చర్య పోయాను అని అనీ మాస్టర్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ కోసం వర్షంలో తడిచాను

పవన్ కళ్యాణ్ కోసం వర్షంలో తడిచాను

పవన్ కళ్యాన్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి పని చేశాను. నేను మాస్టర్ అయిన తర్వాత రెండు సార్లు ఆయన కోసం వర్షంలో తడుచుకుంటూ వెయిట్ చేశాను. అపుడు నా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. నేను అలా తడుచుకుంటూ నిల్చుంటే ఎవరీ అమ్మాయి అని అనుకున్నారు. గణేష్ మాస్టర్ సహాయంతో కలిశాను. పవన్ సార్ ను కలిసిన తర్వాత నేను మాస్టర్ మాస్టర్ అయిన విషయం చెప్పగానే.... వెంటనే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. తర్వాత కాటమరాయుడు సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ చేశాను.

చాలా ఏడ్చాను

చాలా ఏడ్చాను

ద్వారకలో నాకు ఓ సాంగ్ చేసే అవకాశం వచ్చినపుడు డైరెక్టర్ ఎలా చేద్దామంటే అలా చేసేందుకు సిద్ధమయ్యాను. రెండు రోజుల షూట్ కూడా అయింది. కానీ నాకు చెప్పకుండా నన్ను పక్కన పెట్టి గణేష్ మాస్టర్‌తో పాట పూర్తి చేశారు. ఆ విషయం నాకు ముందే చెబితే నేను బాధ పడేదాన్ని కాదు. నాకు చెప్పకుండా చేయడంతో ఏడుపొచ్చింది. వెంటనే ప్రొడక్షన్ కు ఫోన్ చేసి తిట్టేశా...ఆడదాన్ని అని భయపడేదాన్ని కాదని అనీ మాస్టర్ తెలిపారు.

ముందు స్టేజ్ షోలు చేసేదాన్ని

ముందు స్టేజ్ షోలు చేసేదాన్ని

వర్షం 50 డేస్ ఫంక్షన్ సమయంలో స్టేజ్ షో చేశాను. అపుడు నాకు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు అసిస్టెంట్‌గా రమ్మని అడిగారు. అప్పటికే నేను స్టేజ్ షోలతో బిజీగా ఉన్నాను. దాదాపు 1000 దాకా స్టేజ్ షోలు చేశాను అని తెలిపారుప

చిరంజీవి పేపరు చెప్పగానే ఫోన్ పెట్టెయ్యమన్నాను

చిరంజీవి పేపరు చెప్పగానే ఫోన్ పెట్టెయ్యమన్నాను

చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ అంటే ముందు నమ్మలేదు. చిరంజీవిగారి ఇంట్లోనే రిహార్సల్ అంటే అసలు నమ్మకలేక పోయాను. జోక్ చేస్తున్నారు, ఫోన్ పెట్టేయ్ అన్నా. చిరంజీవి గారి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉంది. సెకండ్ మూవీ పవన్ కళ్యాణ్ గారి గుడంబా శంకర్ చేశాను. అందులో కిల్లీ కిల్లీ సాంగుకు అసిస్టెంటుగా చేశాను అని అనీ మాస్టర్ తెలిపారు.

English summary
Choreographer Anee master Positive comments about Balakrishna. Anee master said "Balakrishna is a good human being. All the bad news about him is false news."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu