రాకేష్ మాస్టర్ విగ్రహం రెడీ.. అన్ని అడుగుల ఎత్తు.. పుల్లయ్యలా ఉందంటూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు రాకేష్ మాస్టర్. ఎంతోమంది తెలుగు హీరోలకు ఆయన గురువుగా మారి డ్యాన్స్ నేర్పించారు. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్లుగా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే. డ్యాన్సులో ఓనమాలు సైతం రాని సమయంలో తనకు రాకేష్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించారంటూ ప్రభాస్ సైతం ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే జూన్ 18న రాకేష్ మాస్టర్ మరణించగా.. ఆయన స్మారకార్థంగా విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
గాంధీ ఆసుపత్రికి:తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు రాకేష్ మాస్టర్. విజయనగరం ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొన్న ఆయన హైదరాబాద్ కి బయలు దేరే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటినా ఆసుపత్రిలో చేర్పించారు. ఇక రక్త విరేచనాలు చేసుకున్న రాకేష్ మాస్టర్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

జూన్ 18న: జూన్ 18న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. జూన్ 19న అశేష అభిమాన ప్రేక్షకుల మధ్య అంతిమయాత్ర నిర్వహించి.. దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఆయన మరణంపై అనేక కారణాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

అత్యంత సన్నిహితుడు: ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా సేవలందించిన రాకేష్ మాస్టర్ గుర్తుగా విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేష్ మాస్టర్ కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని రూపొందించేందుకు పూనుకున్నారు.

సొంత డబ్బుతో: అప్పట్లో ఢీ డ్యాన్స్ షోలో వైష్ణవుడి వేషధారణలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు రాకేష్ మాస్టర్. ఈ డ్యాన్స్ చాలా మందికి గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేష్ మాస్టర్ గెటప్ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. అంతేకాకుండా ఏ ఒక్కరి దగ్గర సహాయం ఆశించకుండా సొంత డబ్బుతోనే విగ్రహం తయారు చేయిస్తున్నారట.

వీడియో వైరల్: రాకేష్ మాస్టర్ విగ్రహం విషయం గురించి ఆయన శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాకుండా రాకేష్ మాస్టర్ విగ్రహం ఎలా ఉందో వీడియో సైతం విడుదల చేశాడు. ఈ వీడియో అతి త్వరలో వైరల్ గా మారింది. అయితే ఆ విగ్రహం చూసిన చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పుల్లయ్యలా ఉంది: రాకేష్ మాస్టర్ విగ్రహంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "మీకు ఏ ఫొటో దొరకలేదా భయ్యా?. అస్సలు మ్యాచ్ కాలేదు", "ఇది రాకేష్ మాస్టర్ విగ్రహంలా లేదు. పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది" అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాకేష్ మాస్టర్ 11 అడుగుల విగ్రహం పూర్తిగా తయారు కావడానికి మరో 15, నెలరోజుల సమయం పడుతుందని వీడియోలో బషీర్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











