Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ భార్య ఫిర్యాదు..

Jani Master Case:టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కేవలం ఇండస్ట్రీలోనే కాదు రెండు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనపై లైంగిక దాడి చేశాడని ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ క‌స్టడీ గ‌డువు ముగియ‌డంతో అత‌డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ తరుణంలో ఈ కేసులో మరో ట్విస్ట్ జరిగింది. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ భార్య సుమలత సంచలన ఆరోపణలు చేసింది. అసలేం జరిగింది. ఇంతకీ ఈ కేసులో ట్వీస్ట్ ఏంటో?

ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేసిన లేడి డ్యాన్స‌ర్‌ను లైంగికంగా వేధించడానే ఆరోపణలు రావడంతో కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది.ఈ క్రమంలో అదుపులో తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఆయన పోలీసు కస్టడికి తరలించిన విషయం తెలిసిందే.

Choreographer Jani Master Wife Sumalatha Complaint On Lady Choreographer In Film Chamber

నాలుగు రోజులు పాటు పోలీసు క‌స్ట‌డీలో ఉన్న జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు విచారించారు. క‌స్టడీ గ‌డువు శనివారంతో (నేటీతో) ముగియ‌డంతో జానీమాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు జానీ మాస్టర్ దాటవేశారనీ, బాధితురాలే తనను వేధించిందని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జానీకి అక్టోబ‌ర్ 3 తేదీ వ‌ర‌కు జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించి, అతడ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ తరుణంలో జానీ మాస్ట‌ర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నా భర్త‌ను కావాల‌ని ట్రాప్ చేసి.. ప్రేమ పేరుతో లేడీ కొరియోగ్రాఫర్, ఆమె తల్లి వేధింపుల‌కు గురిచేశారనీ, వారు జానీ మాస్టర్ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నారని ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌కు జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త ఫిర్యాదు చేసింది
తన భ‌ర్త ద‌గ్గ‌ర‌ కావాలనే ప్రేమ పేరుతో వేధింపుల‌కు గురిచేసిందంటూ సుమ‌ల‌త ఆరోపించింది.

గత ఐదేళ్లుగా త‌న‌కు, జానీ మాస్టర్ కు న‌రకం చూపించిదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ లేడీ కొరియోగ్రాఫర్ వల్ల తాను సుసైడ్ చేసుకునే స్టేజ్ కు వెళ్లాననీ, త‌న భ‌ర్త ఇంటికి రాకుండా అడ్డుకునేద‌ని, జానీ మాస్టర్ ను పెళ్లిచేసుకోవాల‌ని వేధించేద‌ని సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాలు తనకు తెలిసి లేడీ కొరియోగ్రాఫర్ ను నిలదీస్తే.. మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Choreographer Jani Master Wife Sumalatha Complaint On Lady Choreographer In Film Chamber

ఆ అమ్మాయి చాలా ఏండ్లుగా డ్యాన్స్ షోలు చేస్తుందనీ, తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో పరిచయాలు ఉన్నాయనీ, ఆమెకు అక్రమ సంబంధం ఉందనన్నారు. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడరని తెలిపారు. ఈ పరిణామంతో కక్షకట్టిన ఆ అమ్మాయి, ఆమె తల్లి కావాలని కుట్ర పన్ని.. లైంగిక దాడి చేశారంటూ అక్రమ కేసు పెట్టారని తెలిపారు.

ఇలాంటి వారు పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేస్తారనీ, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానని తెలిపారు సుమలత. ఆ అమ్మాయితో పాటు తన తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందనని ఆరోపించింది. తనకు , తన పిల్లలకు ఏం జరిగినా దానికి ఆ తల్లి కూతుళ్ళదే బాధ్యతననీ, తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాననీ జానీ మాస్టర్ భార్య సుమలత పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X