‘ఆ అమ్మాయి 18 ఏండ్లు నిండాకనే ఇండస్ట్రీకి వచ్చింది.. అలాంటప్పుడూ..’: జానీ మాస్టర్ భార్య షాకింగ్ కామెంట్స్

Jani Master Case: టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌ కేసుపై ఆయన భార్య ఆయేషా (సుమలత) స్పందించారు. ఆ మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన విషయాలు బయటపెట్టారు. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు,ఆయనను అరెస్ట్ వెనక పెద్ద కుట్ర జరుగుతోందని, ఆ అమ్మాయి ఎలాగైనా టాప్ పొజిషన్ కి వెళ్లాలని ఇలా చేసిందని, ఈ కేసు విషయంలో ఆమెకు తన పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉందని చెప్పారు.

లేడీ కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలను ఆయేషా ఖండించింది. ఆ అమ్మాయి 16 ఏండ్ల వయస్సులో ఇండస్ట్రీకి రాలేదనీ, 'ఢీ' జోడీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో అసలు మైనర్లను తీసుకోరని, ఆ ప్రోగ్రామ్ లో 18 ఫ్లస్ వారినే తీసుకుంటారని అన్నారు. అలాంటి అప్పుడు ఆ అమ్మాయి మైనర్ ఉన్నా తప్పడు ప్రూవ్స్ తో షోలోకి వచ్చిందా? అన్ని ప్రశ్నించారు.ఆ అమ్మాయి మైనర్ కాదనీ, పోక్సో చట్టం ఎలా వర్తిసుందని అన్నారు.

Choreographer Johnny Master wife Ayesha aliyas Sumalatha reacted on the case

'లైంగిక వేధింపులు అనేవి అబ్బాయి తరుపునే కాదు.. అమ్మాయి తరుపునా కూడా జరుగుతాయి. ఆ అమ్మాయిపై మేమే కేసు పెట్టాలి. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాలి. కానీ అబ్బాయిలు చెప్పితే.. సిగ్గుపోతుందని చెప్పడం లేదని ఏ మగాడు చెప్పడు. ఆ అమ్మాయి మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టింది. కానీ జానీ మాస్టర్ బయటకు చెప్పుకోలేదు ' అని ఆయేషా షాకింగ్ కామెంట్స్ చేసింది.

జానీ మాస్టర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మత మారాలని ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలను ఆయేషా కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాము ఇద్దరం 14 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామనీ, తమకి ఇద్దరూ పిల్లలున్నారని అన్నారు. అలాగే.. ఆమెని మతం మారమని ఎవరు బలవంత పెట్టలేదనీ, ఎవరైనా బలవంత పెట్టినా మతం ఎలా మార్చుకుంటారని అన్నారు. ఆ అమ్మాయి పేరు శ్రేష్ట వ‌ర్మ.. తానే మా మతం ఆచారాలను బాగున్నాయనీ, తాను మతం మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం జానీ మాస్టర్ భార్య ఆయేషా రిమాండ్ రిపోర్టు గురించి మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదనీ. అలాంటి అప్పడూ ఆయన ఎలా ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకోరు. అది నిజం కాదు. మెడికల్ జరిగినా ప్రూవ్ చేయలేదు. దాదాపు ఆ అమ్మాయితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. అమ్మాయితో ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. ఈ వివాదంలో పోక్సో యాక్ట్, రేప్ కేసు ఎలా వస్తుంది. అయినా ఏం ఆధారాలు ఉన్నాయని అడిగారు.

ఇది పూర్తిగా తప్పుడు కేసు, కావాలనే జానీ మాస్టర్ ను ఇరికిస్తున్నారు. ఆమెకి మద్దతుగా ఉంది ఎవరో కేసు పెట్టించారు. ఆమెకు డ్యాన్స్ మాస్టర్ కార్డు రాకపోతే జానీ మాస్టరే.. కార్డ్ ఇప్పించారనీ, తనే మాస్టర్ ను ఇష్టపడిందని అన్నారు. ఆ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని కోరిక. అందుకే జానీ మాస్టర్ ను వాడుకుందని అన్నారు. ఈ విషయంలో చాలా సార్లు అమ్మాయి తల్లి కూడా మా ఇంటికి వచ్చింది. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు జానీ మాస్టర్ భార్య ఆయేషా .

More from Filmibeat

Read more about: jani master case tollywood ayesha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X