హీరోగా ఎంట్రీ ఇస్తున్న డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్
హైదరాబాద్ : ఇప్పటికే పలువురు కొరియో గ్రాఫర్లు వెండి తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. డాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవాతో పాటు, రాఘవ లారెన్స్ ఇప్పటికే హీరోలుగా ఎదిగారు. వారి బాటలో మరో డాన్స్ మాస్టర్ హీరోగా పరిచయం కాబోతున్నారు.
ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా పాపులర్ అయిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రేమ్ రక్షిత్ హీరోగా రూపొందబోయే ఈ సినిమాకు కె.ఆర్.కె పవన్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ఇప్పటికు ప్రేమ్ రక్షిత్ పని చేసిన కొన్ని సూపర్ హిట్సినిమాల వివరాలు..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి - జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'యమదొంగ', వివి వినాయక్ - జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'అదుర్స్', రాజమౌళి - రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన 'మగధీర' చిత్రంతో పాటు బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసారు.
అదే విధంగా వివి వినాయక్-అల్లు అర్జున్ కాబినేషన్లో వచ్చిన 'బద్రీనాథ్' చిత్రంతో పాటు, అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య-2, పరుగు, సంపత్ నంది-రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన 'రచ్చ' చిత్రాలకు పని చేసారు. ప్రస్తుతం ఆయన కొరియెగ్రఫీ అందిస్తున్న వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న 'రేయ్', సుకుమార్-మహేష్ కాంబినేషన్లో రూపొందుతున్న '1' చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











