twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిల్క్ స్మితకు అలా దూరమయ్యా.., వాళ్లిద్దరితో కష్టం.. టాప్ డ్యాన్సర్ ఎవరంటే: శివశంకర్ మాస్టర్

    |

    Recommended Video

    Silk Smita clash with Choreographer Siva Sankar

    శివశంకర్ మాస్టర్.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కొరియోగ్రఫర్. ప్రధానంగా సాంప్రదాయ కళా నృత్యాలకు పెట్టింది పేరు. జానపదమైనా.. సాంస్కృతిక నృత్యమైనా.. ఏరి కోరి మరీ శివశంకర్ మాస్టర్‌ను పిలిపించి కంపోజ్ చేయించుకుంటారు దర్శకులు. అలాంటి మాస్టర్ ఓ ప్రముఖ చానెల్ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. ఆ విశేషాలు మీకోసం ఆయన మాటల్లోనే..

    నాట్యకారుడిగా మారిన తర్వాత మీలో ఆడతనం వచ్చేసిందా?..

    నాట్యకారుడిగా మారిన తర్వాత మీలో ఆడతనం వచ్చేసిందా?..

    మీకది ఆడతనం. కానీ నాలో రౌద్రం కూడా ఉంది. నాట్యం లలిత కళ. శివశంకర్ లో శివుడు ఉంది. అలాగే శంకరీ ఉంది. నేను రెండింటితోనూ ప్రయాణిస్తా. నేను చదువుకున్న పాఠశాలలో అయ్యవార్ల పిల్లలంతా పంచ, జుబ్బా, విబూధి పెట్టుకుని సాంప్రదాయబద్దంగా వచ్చేవారు. అదిచూసే హిందూ ధర్మంగా కట్టూ.. బొట్టూ అలవాటు చేసుకున్నా.

    సాంప్రదాయ నృత్యాలనగానే ఆడపిల్లలనే ఎక్కువగా ప్రోత్సహిస్తారు కదా.. మీ ఇంట్లో మిమ్మల్ని వద్దని వారించలేదా?..

    సాంప్రదాయ నృత్యాలనగానే ఆడపిల్లలనే ఎక్కువగా ప్రోత్సహిస్తారు కదా.. మీ ఇంట్లో మిమ్మల్ని వద్దని వారించలేదా?..

    ఇంట్లో అందరూ గ్రాడ్యుయేట్స్. నేను స్కూల్ ఫైనల్ దాకా చదివాను. కానీ నాట్యం పట్ల ఇష్టంతో అటువైపు వెళ్తాను అని నాన్నగారితో చెప్పాను. గజ్జెలు కట్టి సినిమాల్లో ఆరంగేట్రం చేయాలనే కోరిక ఉండేది. నాన్నేమో స్ట్రిక్ట్. ఆయనో బిజినెస్‌మ్యాన్. డ్యాన్స్ గురించి చెబితే గద్దించి పంపించారు.

    అలా సినిమాల్లోకి..:

    అలా సినిమాల్లోకి..:

    ఓరోజు అద్దం ముందు నిలిచి ప్రాక్టీస్ చేస్తుంటే నాన్న వచ్చి చూశారు.

    'ఎప్పుడూ అందం ముందేంట్రా.. అంత అందగాడివా?' అన్నారు. వీడికి ఈ పిచ్చేంటని నా జాతకం చూశారు. ఆ తర్వాత నటరాజ్, శకుంతల అనే విద్యాంసుల దగ్గర చేర్చారు. ఏడేళ్లు అక్కడ గురుకులంలో ఉండి నేర్చుకున్నాను. ఆ తర్వాత సలీం గారు నా గురువు. అలా సినిమాల్లోకి వచ్చాను.

    సిల్క్ స్మితతో వివాదం:

    సిల్క్ స్మితతో వివాదం:

    షీ ఈజ్ బ్యూటీఫుల్ ఆర్టిస్ట్. నాకు చాలా ఇష్టమైన ఆవిడ. ఇండస్ట్రీలో ఆమెలా కాస్టూమ్స్ వేసుకునేవాళ్లని నేను చూడలేదు. ముంబైలో రేఖ.. ఇక్కడ స్మిత. ఒకసారి రూ.5వేల చీర కట్టమని ఇస్తే.. సొంతంగా మరో రూ.20వేలు ఖర్చుపెట్టి అద్భుతంగా కుట్టించుకుంది. బ్యూటీఫుల్ టేస్ట్ ఉన్న ఆర్టిస్ట్. అయితే పేరొచ్చిన తర్వాత మాత్రం ఆమె సొంతంగా డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకున్నారు. పెద్ద డ్యాన్స్ మాస్టర్ పులిగిరి సరోజను ఆమె రిఫర్ చేసేది. ఆమె లేనప్పుడు మాత్రమే మాలాంటివాళ్లకు ఛాన్స్.

     స్మితతో గొడవేంటి? అని అడిగారు..:

    స్మితతో గొడవేంటి? అని అడిగారు..:

    సరోజ మాస్టర్ కాకుండా మాలాంటివాళ్లను పెడితే స్మిత నానా యాతన పెట్టేది. ఆవిడ కావాలనుకున్న మాస్టర్ లేకపోతే ఆమెతో కష్టం. బాలయ్య బాబు 'భలే తమ్ముడు' షూటింగ్ లో ఇదే జరిగింది. అందులో నాలుగు పాటలు చేశాను. ఐదో పాట స్మితతో ప్లాన్ చేశారు. రిహార్సల్స్ నుంచి ఇంటికొచ్చాక ఆఫీస్ నుంచి ఫోన్ కాల్. ఏంటని ఆరా తీస్తే.. స్మితతో గొడవేంటి మాస్టర్? అని అడిగారు.

     స్మితకు అలా దూరమయ్యా:

    స్మితకు అలా దూరమయ్యా:

    స్మితతో నాకేం గొడవ లేదని చెప్పాను. కానీ ఏమైందో తెలియదు మీతో చేయనంటోంది అన్నారు. సరే వేరేవాళ్లను తీసుకోండి అని చెప్పాను. . 'మాస్టారు బాగా కంపోజ్‌ చేశారు. స్మిత చేయనంటే వేరే వాళ్లని తీసుకోండి' అని నిర్మాత అర్జున్‌రాజు చెప్పారు. కానీ స్మిత అప్పటికే తాను చేయనని చెక్కు కూడా వెనక్కి ఇచ్చేసింది. దాంతో నాకు బాధేసింది. ఆ తర్వాత అదే సాంగ్ జయమాలినితో తీశాం. అక్కడి నుంచి నేనే ఆవిడకి దూరమయ్యా.

     వాళ్లిద్దరితో కష్టం?:

    వాళ్లిద్దరితో కష్టం?:

    కృష్ణ మంచి డ్యాన్సర్‌. అయితే చిన్న టెక్నిక్‌ ఉంది. హీరోయిన్‌ను పక్కనే పెట్టకూడదు. కొంచెం ముందు ఉంచాలి. అప్పుడు వాళ్లను చూసి ఆయన చేసేస్తారు. ఎంతైనా కృష్ణ, శోభన్‌బాబులతో డ్యాన్స్‌ చేయించడం కష్టం. వాళ్లిద్దరిని హీరాలాల్‌ మాస్టర్‌ మెలితిప్పేశారు. ఆయనవల్లే ఆమాత్రమైనా చేశారు.

     పెద్ద ఎన్టీఆర్‌... జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇద్దరితోనూ పనిచేశారు కదా!..

    పెద్ద ఎన్టీఆర్‌... జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇద్దరితోనూ పనిచేశారు కదా!..

    ఎన్టీఆర్‌ ఒక లెజెండ్‌. చిన్న ఎన్టీఆర్‌ మంచి కళాకారుడు. ఆ ఎన్టీఆర్‌... మళ్లీ ఈ ఎన్టీఆర్‌... అలా కుదిరిపోయింది చూడండి! అదే పెద్ద విషయం కదా!

     టాప్ డ్యాన్సర్ అతనే..:

    టాప్ డ్యాన్సర్ అతనే..:

    బన్నీ బాగా డ్యాన్స్‌ నేర్చుకున్నాడు. మన యువతరం దీన్ని ఈదాలి అనే కృషితో పనిచేస్తున్నాడు... అందుకు హ్యాట్సాఫ్‌. బ్యూటీఫుల్‌ డ్యాన్సర్‌. తనంటే చాలా ఇష్టం. తెలుగులో టాప్‌ డ్యాన్సర్‌ బన్నీనే!. అతనితో 'వరుడు' చేశాను.

    English summary
    Choreographer Siva Sankar master explained about his clash with Silk Smita in latest interview. Siva Sankar said Bunny is the best dancer in tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X