నీకు తల్లి, చెల్లి ఉన్నారు కదా? నీకు సిగ్గులేదా? సమీర్‌పై జానీ మాస్టర్ బాధితురాలు ఫైర్

Jani Master Case: టాలీవుడ్ లో సంచలన రేపిన విషయాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ వివాదం ఒక్కటి. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జానీ మాస్టర్‌ని అరెస్ట్‌ కావడం, దాదాపు నెల రోజుల వరకు జైల్లో ఉండి.. కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చారు. తను ఏ తప్పు చేయలేదని, తనేంటో నిరూపించుకుంటానని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ చెపుకొచ్చారు. కానీ బాధితురాలు మాత్రం ఇప్పటివరకు మీడియా మందుకు రాలేదు. కానీ, తాజాగా బాధితురాలు శ్రేష్టి వర్మ ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో పలు సంచనల విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఆ విషయాలేంటీ?

గతేడాది బాధితురాలు శ్రేష్టి వర్మ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించడం ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గోవాలో తలదాచుకున్న జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టులో హజరు పర్చడం, రిమాండ్ లో బాగంగా చంచల్ గూడ జైలుకు తరలించడం, దాదాపు నెల రోజుల తర్వాత .. జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది. అన్నింటిలోకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ నిలిచిపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

choreographer shrasti verma sensational comments on jani master case

అయితే.. తాజాగా బాధితురాలు శ్రేష్టి వర్మ ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో పలు సంచనల విషయాలు వెల్లడించారు. ఈ కేసు విషయంలో తనకు ఫిలిం ఛాంబర్ పెద్దలు, మీడియా మిత్రులు, సన్నిహితులు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారని శ్రేష్టి వర్మ గుర్తు చేసుకున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ తన కేసు పై దర్యాప్తు జరిపి, ఓ నివేదిక నిచ్చిందనీ, ఆ నివేదికను తాను కోర్టులో సబ్మిట్ చేయబోతున్నానని పేర్కొన్నారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని ఆశించారు.

ఈ తరుణంలో జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ చర్య వెనుక అతని భార్య ప్రమేయం కూడా ఉందని, ఆమె కూడా డ్రామాలు ఆడుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే ఎవరికి భయపడలేని పేర్కొన్నారు బాధితురాలు శ్రేష్టి వర్మ . అలాగే జానీ మాస్టర్ సన్నిహితుడు, బంధువు సమీర్ అనే వ్యక్తి తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, అతనికి మీడియా కూడా సపోర్ట్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తానే అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడననీ, తనపై అభ్యంతరంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరు కూడా.. విచారణ చేయలేదని శ్రేష్టి వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సంచలన ఆరోపణ చేసిన వ్యక్తిపై ఎక్కడు ఉన్నారు? తనపై కేసు పెడుతాననీ, ఒకవేళ వీలుకాపోతే డైరెక్ట్ గా ప్రవేట్ కంప్లీట్ ఫైల్ చేస్తానని మీడియా ముందు మాట్లాడుతూ కదా.. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ? ఆ వ్యక్తి పై ఆరోపణలపై చర్యలు తీసుకోరా? అంటూ ప్రశ్నించారు.

బెదిరిస్తే.. భయపడటానికి అమ్మాయిని కాదు. ఆ వ్యక్తి కూడా తల్లి, చెల్లి ఉన్నారు కదా.. భవిష్యత్తులో అతడికి కూడా భార్య వస్తుంది కాదా.. ఇలాంటి చెత్త ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలంటూ బాధితురాలు శ్రేష్టి బాధపడింది. ఆ వ్యక్తికి మీడియా కూడా సపోర్టు చేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు శ్రేష్టి. జానీ మాస్టర్‌ నాలుగేళ్ల క్రితం వేధిస్తే..ఇప్పుడెందుకు కేసు పెట్టావని చాలా మంది అడుగుతున్నారు కాదా.. మరి సమీర్‌ నాలుగేళ్ల తర్వాత నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? నేను అంటే అమ్మాయిని.. నాకు సపోర్టు లేదు. అతను అబ్బాయి కదా.. అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? ఇదంతా జానీ మాస్టర్, అతని భార్య ఆడించిన డ్రామా అంటు సంచలన ఆరోపణలు చేసింది.

నేను ఎప్పుడైతే.. ధైర్యంగా నిలబడి ఫైట్‌ చేయగలనో .. అనుకున్నప్పడే బయటకు వచ్చాను. సమాజం గురించి ఆలోచించలేదు. సోషల్‌ మీడియాను పట్టించుకోలేదు. ఈ క్రమంలో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేశాను,కానీ, రివేంజ్‌ కోసం ఆ కేసు పెట్టలేదని పేర్కొన్నారు. అమ్మాయిలంటే.. ఆట బొమ్మలు కాదని.. వాళ్లకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయని, వాటిని అందరూ గౌరవించాలని విజ్ఞత్తి చేసింది. తన లాగే అన్యాయం జరిగిన అమ్మాయిలంతా ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు శ్రేష్టి వర్మ.

More from Filmibeat

Read more about: shrasti verma jani master case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X