‘మన అనుమతి లేకుండా మన ఒంటి మీద ఎవరు చేయి వెయ్యరు’.. జానీ మాస్టర్ కు లేడీ కొరియోగ్రాఫర్ సపోర్టు..

Jani Master Case: స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు కావడం కేవలం ఇండస్ట్రీలోనే కాదు రెండు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎంతో మంది స్టార్ హీరోస్,హీరోయిన్స్ తో ప్రశంసలు అందుకున్న జానీ మాస్టర్.. తనను లైంగికంగా హింసించాడనే ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ఏకంగా ఆయనను పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. ఆ లేడీ కొరియోగ్రాఫర్ మద్దతు నిలుస్తారు. అయితే.. ఓ ప్రముఖ కొరియో గ్రాఫర్ మాత్రం జానీ మాస్టర్ కు సపోర్ట్ నిలిచి.. ఆ అమ్మాయిపై ఊహించని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇంతకీ లేడీ కొరియో గ్రాఫర్ ఎవరో ఓ లూక్కేయండి.

గత రెండుమూడు రోజులుగా జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో సంచలన రేపుతోంది. మాస్టర్ తన దగ్గర పనిచేసే ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకోవాలని, తనను పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేశాడని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాకుండా.. అవుట్ డోర్ పేరుతో తనని బయటకు తీసుకెళ్లి పలు మార్లు లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు అయిన నాటి నుంచి ఆయన పరారీలోనే ఉన్నారు. పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.

Choreographer Swarna Master Sensational comment on Jani Master Case

ఎట్టకేలకు జానీ మాస్టార్ ను పోలీసులు పట్టుకున్నారు. గతరాత్రి బెంగుళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ రోజు సాయంత్రం జానీ మాస్టార్ ను విచారించి శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. జానీ మాస్టర్ భార్య ను సైతం తన పై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమెకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదెలా ఉంటే..జానీ మాస్టర్ కు లేడీ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ (Swarna Master) అండగా నిలిచారు.

లేడీ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాధితురాలిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అటు జానీ మాస్టర్.. ఇటు బాధిత లేడీ డాన్సర్ తో తనకు ఎలాంటి పరిచయం లేదు. కానీ, పలు మీడియా కథనాలను బట్టి చూస్తే.. ఏదో కావాలని చేస్తున్నా కుట్రగా ఉందని అన్నారు. స్వర్ణ మాస్టర్ మాట్లాడుతూ.. 'బాధిత లేడీ డాన్సర్, జానీ మాస్టర్ గురించి నాకు పరిచయం లేదు. కానీ ఆ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర 5 లేదా 6 ఏండ్లుగా వర్క్ చేస్తుంది. తప్పు మొదటి సారిగానే మాట్లాడకుండా.. ఇప్పుడేందుకు మాట్లాడుతుంది. జానీ మాస్టర్ తప్పుగా ప్రవర్తించి ఉంటే.. మొదటనే పోలీసులకి ఫిర్యాదు చేయ్యాల్సింది. కానీ, ఆయన దగ్గర పని చేయడం మానేసిన సంవత్సరంన్నర తర్వాత ఎందుకు కంప్లైంట్ చేసింది? ' అని ప్రశ్నించింది.

స్వర్ణ మాస్టర్ ఇంకా మాట్లాడుతూ.. 'అసలు మన ఫర్మిషన్ లేకుండా మన ఒంటి మీద ఎవరు చేయి వెయ్యరు. మనం చెడిపోవాలన్నా.. బాగుపడాలన్నా.. అది మన చేతుల్లోనే అంశం. అన్ని సంవత్సరాలు జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నాడని నువ్వు చెప్పలేదంటే ఏదో ఆశించే రాజి పడి ఉందేమో.. మన ఓ ప్లాట్ ఉన్నమనుకుందాం.. మన మీద ఎవరో వచ్చి దాడి చేస్తుంటే.. మనం మామూలుగా ఊరుకోం కాదా.. ఒక్క అరుపు అరిస్తే.. పక్కింట్లో వారు రారా.. ఎవరికి వినిపించిన వారందరూ వస్తారు కదా. ఇన్ని రోజులు సెలెంట్ గా ఉండి ఇప్పుడూ రేప్ అంటే ఎలా? ఇన్ని రోజులు బయటకు రానిది. ఇప్పుడే బయటకు రావడం నా కెందుకో జానీ మాస్టర్ మీద కావాలనే ఎవరో కుట్ర చేస్తున్నారేమో అనిపిస్తుంది' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Choreographer Swarna Master Sensational comment on Jani Master Case

జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలపై ఛాంబర్ కూడా పట్టించుకోవాలి. వారు కూడా విచారణ చేయాలి. ఇక్కడ అమ్మాయి జీవితమే కాదు.. ఓ అబ్బాయి కెరీర్ కూడా ఉంది. పైగా జానీకి జాతీయ అవార్డు తీసుకున్నాడన్నారు. ఆయనపై అసూయ తో లేదా కుట్రతో ఇలా కూడా చేసి ఉండవచ్చు.' అని షాకింగ్ కామెంట్స్ చేసింది స్వర మాస్టర్. ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసాడనే విషయమే నమ్మబుద్ది కావడం లేదు. దర్యాపులో అన్ని విషయాలు వస్తాయి' అని స్వర్ణ మాస్టర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ని ఉద్దేశించి ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

More from Filmibeat

Read more about: johnny master rape case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X