కాజల్ ముద్దు వివాదం: సౌందర్య పేరు చెప్పి ఎమోషనల్.. క్లారిటీ ఇచ్చిన ఛోటా కె నాయుడు!
Recommended Video

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ని సీనియర్ కెమెరామన్ ఛోటా కె నాయుడు అసందర్భంగా ముద్దు పెట్టుకున్న సంఘటన తీవ్ర వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంతో ఛోటా కె నాయుడుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చోట గత చిత్రాలని బయటకి తీసి వైరల్ చేస్తున్నారు. సీనియర్ కెమెరా మెన్ గా చోటకు ఇండస్ట్రీలో మంచి పేరుఉంది. ఈ చర్యతో చోట మచ్చ ఏర్పరుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివాదం ముదురుతుండడంతో ఛోటా కె నాయుడు ఎట్టకేలకు స్పందించారు.

సౌందర్య పేరు చెప్పి
ఈ వివాదం విషయంలో ఛోటా కె నాయుడు దివంగత నటి సౌందర్య పేరు చెప్పి ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. సౌందర్య తరువాత నేను అంతగా ఇష్టపడే నటి కాజల్ అగర్వాల్ అని ఛోటా కె నాయుడు తెలిపారు. కాజల్ నటించిన చాలా చిత్రాలకు నేను కెమెరా మెన్ గా పనిచేశాను. ఆమెతో ఎప్పుడు పనిచేసినా సంతోషంగా అనిపిస్తుంది.

కుటుంబ సభ్యుడిలాగే
కాజల్ అగర్వాల్ తనని కుటుంబ సభ్యుడిలాగే భావిస్తుంది. మా ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉందని ఛోటా కె నాయుడు అన్నారు. కాజల్ కు ముద్దు పెట్టిన సంఘటనని సమర్థించుకున్న ఛోటా .. కాజల్ ని అభినందించడానికి మాత్రమే అలా చేశానని అన్నారు.

గొప్ప విషయం చెప్పింది
కవచం చిత్రంలో కాజల్ అద్భుతంగా నటించింది. అందుకు ఆమెని అభినందించడానికి ముద్దు పెట్టుకున్నా. అదే సమయంలో కాజల్ అగర్వాల్ తన తదుపరి చిత్రాల గురించి గొప్ప విషయం చెప్పింది అని ఛోటా అన్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు ఛోటా స్పందనతో చల్లబడుతారో లేదో చూడాలి.

కవచం టీజర్ లాంచ్
ఈ సంఘటన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కవచం ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగింది. స్టేజిపై కాజల్ అగర్వాల్ మాట్లాడుతున్న సమయంలో ఛోటా కె నాయుడు ఒక్కసారిగా ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. దీనితో స్టేజిపై ఉన్న వారంతా ఆశ్చర్యపోయినా రియాక్ట్ కాలేదు. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











