For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛోటాను రెచ్చగొట్టిన తమన్... పబ్లిగ్గా కాజల్‌కు ముద్దు, వార్నింగ్!

    |
    Kavacham Movie Teaser Launch

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం క‌వ‌చం. ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, కాజల్ మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటన హాట్ టాపిక్ అయింది.

    ఇతరులను విష్ చేసే సమయంలో మర్యాద పూర్వకంగా హగ్ చేసుకోవడం సర్వసాధారణమే. అయితే ఛోటా ఏకంగా కాజల్‌ను ముద్దు పెట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

     ఛోటా కె నాయుడు ముద్దు

    ఛోటా కె నాయుడు ముద్దు

    సాధారణంగా సినిమా ఫంక్షన్లలో హగ్గింగ్సే తప్ప కిస్సింగ్స్ ఉండవు. మీడియాలో అనవసర రచ్చ జరుగుతుందనే హీరోలు సైతం ఇలాంటివి చేయడానికి సాహసించరు. అయితే సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ఏకంగా హీరోయిన్‌ను ముద్దు పెట్టుకోవడంతో పెద్ద సీన్ అయింది.

    కాజల్ షాక్... స్వీట్ వార్నింగ్

    కాజల్ షాక్... స్వీట్ వార్నింగ్

    అయితే చోటా కె నాయుడు ముద్దు పెట్టడంతో కాజల్ తెలివిగా రియాక్ట్ అయ్యారు. అతడు చేసిన పనికి నోరెళ్ల బెట్టి షాకవ్వడంతో పాటు... ఏమిటి ఇలా చాన్స్ తీసుకున్నావంటూ నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

    తమన్ రెచ్చగొట్టాడం వల్లే అంటున్న ఛోటా

    తమన్ రెచ్చగొట్టాడం వల్లే అంటున్న ఛోటా

    అయితే తాను ముద్దు పెట్టడానికి కారణం తమన్ అని చోటా వివరణ ఇచ్చారు. మనలాంటి వారు కాజల్‌ను ముద్దు పెట్టుకోలేమని తమన్ రెచ్చగొట్టాడని.... ఎందుకు అది సాధ్యం కాదు అని చెప్పడానికే తాను ముద్దు పెట్టినట్లు తెలిపారు.

    ఇట్స్ ఓకే స్మాల్... నువ్వు నా ఫ్యామిలీ

    ఇట్స్ ఓకే స్మాల్... నువ్వు నా ఫ్యామిలీ

    ఛోటాను ముద్దుగా ‘స్మాల్' అని పిలిచిన కాజల్.... ‘‘నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు, ఫర్వా లేదు.... నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ మాదిరి'' అంటూ ఈ విషయాన్ని పెద్దగా చేయకుండా ముగించింది.

    కవచం

    కవచం

    బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ సొంటినేని(నాని) క‌వచం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

    English summary
    Chota K Naidu Kisses Kajal at Kavacham Teaser Launch. ‘Kavacham’ starring Bellamkonda Sai Sreenivas and Kajal Aggarwal in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X