»   » వర్మ ఐడియా: టెర్రరిస్ట్ దాడినుండి తప్పించుకోవడానికి...

వర్మ ఐడియా: టెర్రరిస్ట్ దాడినుండి తప్పించుకోవడానికి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎక్కడ ఏం జరిగినా ఆయా సంఘటనలపై తనదైన రీతిలో ట్విట్టర్ ద్వారా స్పందించడం రామ్ గోపాల్ వర్మ స్టైల్. ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రవాదుల దాడిపై కూడా వర్మ స్పందించారు. ఈ దాడిలో టెర్రిస్టులు ఖురాన్ చదివిన వారిని వదిలి పెట్టి మిగతా వారిని ఊచకోత కోసిన సంగతి తెలిసిందే.

దీనిపై వర్మ స్పందిస్తూ...'ఏ మతం నుండి వచ్చినవారైనా కూడా స్కూల్లో ఖురాన్ చదువుకుంటే... ఇలాంటి పరిస్థితుల నుండి తప్పించుకునే వీలుంటుంది. ఇదే మంచి ఎస్కేప్ ఆప్షన్. హిందువులూ - క్రీస్టియన్లూ కూడా ఖురాన్ చదువుకుంటే భవిష్యత్తులో ఇలాంటి దాడుల నుండి తప్పించుకోవచ్చు'' అని ట్వీట్ చేసారు.

ఇంతటితో ఆగని వర్మ... మరో వివాదాస్పద కామెంట్ కూడా చేసారు. 'మీరు పాటిస్తున్న మతం మిమ్మల్ని కాపాడలేకపోతే ఖురాన్ అయినా కాపాడవచ్చు' అంటూ ట్వీట్ చేసాడు. వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

వర్మకు ఇలా వివాదాస్పదంగా మాట్లాడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన మత సంబంధమైన వివాదాలకు కారణమ్యారు. వినాయకుడి మీద, ఇతర దేవుళ్ల మీద వివాదాస్పద కామెంట్స్ చేసి కోర్టు చిక్కులు సైతం ఎదుర్కొన్నారు.

English summary
"After the Dhaka killings only solution seems to make Koran reciting compulsory in all schools irrespective of religion as an escape option. Christians n Hindus also should learn Quran to escape being killed by terrorists .if their own religions can't protect them maybe Quran will.." RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X