క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలిన మహేష్ బాబు, ఇతర టాలీవుడ్ స్టార్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ క్రిస్మస్ సంబరాల్లో మునిగితేలారు. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో సంక్రాంతి, దీపావళితో పాటు ప్రతి ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మహేష్ భార్య నమ్రత ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు.

క్రిస్మస్ సెలబ్రేషన్లో మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోను షేర్ చేసిన నమ్రత ఇది తన ఫేవరెట్ శాంటా పిక్చర్స్ అని పేర్కొన్నారు.

సమంత, చైతూ
క్రిస్మస్ సంబరాల్లో సమంత, నాగ చైతన్య. పెళ్లి తర్వాత వీరు జరుపుకుంటున్న రెండో క్రిిస్మస్ వేడుక. నాగ చైతన్య హిందూ, సమంత క్రిస్టియన్ కావడంతో రెండు సాంప్రదాయాల్లో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీతో మంచు విష్ణు
ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ హాలిడే ఎంజాయ్ చేస్తున్న మంచు విష్ణు అభిమానులకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

కూతురుతో కలిసి మంచు లక్ష్మి
తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న మంచు లక్ష్మి. క్రిస్మస్ ఎంతో అందమైన రోజని, ప్రతి ఒక్కరూ సంతోషంగా గడపాలని ఆమె ఆకాంక్షించారు.
దేవిశ్రీ ప్రసాద్
క్రిస్మస్ విషెస్ తెలియజేస్తూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్.
శాన్వి
తెలుగు హీరోయిన్ శాన్వి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడం సౌత్ లోని ఇతర భాషల్లో ప్రయత్నాలు చేస్తోంది.
హంసా నందిని
తెలుగు నటి, ఐటం గర్ల్ హంసా నందిని తన ఫోటోతో అభిమానులు తయారు చేసిన క్రిస్మస్ పోస్టర్ షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











