twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రిస్ మస్ అంటే తెలుగు సినిమాకు పండగే...

    By Bojja Kumar
    |

    క్రిస్ మస్ అంటే క్రైస్తవులకు అతిపెద్ద పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజైన ఈ రోజును ఇంటిల్లిపాదీ సందడిగా జరుపుకుంటారు. సినిమా రంగంలోనూ క్రిస్ మస్ పండగకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు ఏసు క్రీస్తు జీవిత చరిత్రపై రూపొందిన సినిమాలు అనేకం వచ్చాయి. క్రిస్ మస్ హాలిడేలను, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు చిత్రాలు విడుదల చేయడం కొన్నేళ్లుగా సినీ రంగంలో ఆనవాయితీగా మారింది.

    ఇక మన తెలుగులో ఏసు క్రీస్తు సినిమాలన్నా, ఏసుక్రీస్తు అన్నా ముందు గుర్కొచ్చేది ప్రముఖ నటుడు విజయచందర్. కరుణామయుడు, రాజాధిరాజ చిత్రాలతో పాటు అనేక సినిమాల్లో ఆయన పోషించిన ఏసు క్రీస్తు పాత్ర అద్భుతం. ఏసుక్రీస్తు అంటే ఇలానే ఉంటాడు అనే స్థాయిలో సూపర్ గా నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారాయన.

    ఇప్పటి యువ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమాలో దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. పవన్‌ కళ్యాణ్‌ 'ఏసుక్రీస్తు" గా నటిస్తున్న కొత్త చిత్రాన్ని ప్రముఖనిర్మాత కొండా క్రిష్ణంరాజు ఆదిత్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారని, సంచలన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగినప్పటికీ....ఎందుకో ఆ సినిమా అటకెక్కినట్లే కనిపిస్తోంది. అయితే వచ్చే సంవత్సరం నాటికైనా పవన్ ఏసు క్రీస్తుగా దర్శనం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఈ సంవత్సరం క్రిస్టమస్ పండగను పురస్కరించుకుని తెలుగులో రాజన్న, నందీశ్వరుడు లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాల సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. రాజన్న సినిమా నాగార్జున కెరియర్ లోనే ఓప్రత్యేక చిత్రంగా నిలవబోతోందని అంటున్నారు.

    English summary
    Nagarjuna 'Rajanna' movie releasing on this Christmas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X