విడుదలకు సిద్ధమవుతున్న ‘చూడాలని చెప్పాలని’
హైదరాబాద్: శ్రీ శివశంకర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తారకరత్న, మాధవి లత జంటగా నవయువ దర్శకుడు పార్గవన్ దర్శకత్వంలో నాగమల్ల శంకర్ నిర్మిస్తున్న పూర్తి ఎంటర్ టైన్మెంట్ విత్ లవ్ సబ్జెక్ట్ చిత్రం 'చూడాలని చెప్పాలని' డిటియస్ వర్క్ పూర్తి చేసుకుని ఫస్ట కాపీకి ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగమల్ల శంకర్ మాట్లాడుతూ..దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయి. మరో వారంలో సెన్సార్ కు పంపి ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. హీరో తారకరత్న, హీరోయిన్ మాధవి లత ప్రోత్సాహంతో డైరెక్టర్ పార్గవన్ కమిట్ మెంట్ ప్రకారం అనుకున్న సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదలకు సిద్ధమవుతున్నామన్నారు.
ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ అయ్యే సబ్జెక్టుతో దర్శకుడు ఈ చిత్రంలో తన ప్రతిభను చాటుకున్నారు. చిత్రం చూస్తే ప్రతి ప్రేక్షకులు దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేరు. అలాగే ఈ చిత్రంలో ఆణిముత్యాల్లాంటి పాటలను అద్భుతంగా కుదిరాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.
తారకరత్న, మాధవిలత, ఎం. బాలయ్య, కాశీవిశ్వనాథ్, అనితానాథ్, విజయ్, అంబటి శ్రీను, ఫణి, భూపతి, గిరి, డాక్టర్ కృష్ణారావు, కృష్ణ తేజ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచన: వెన్నెల కంటి, సంగీతం: సాయి కార్తీక్, పాటలు: వెన్నెలకంటి, సాహితి, జయసూర్య, బాలాజీ, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: అమర్, కథ: రాజదురై, ఆర్ట్: వెంకటేశ్వర్లు, ప్రొడక్షన్ కంట్రోలర్: మల్లిక్, లైన్ ప్రొడ్యూసర్: నయీమ్, సహ నిర్మాతలు: వద్ది నరసింహరావు, రఫతునీషా షేక్, నిర్మాత: నాగమల్ల శంకర్, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: పార్గవన్.


Click it and Unblock the Notifications











