లవర్ బోయ్ తరుణ్ చిత్రాన్ని ఎట్టకేలకు దుమ్ము దులిపుతున్నారు
నువ్వే కావాలి చిత్రంతో లవర్ బోయ్ గా పరిచయమైన తరుణ్ ఆ తర్వాత వరస ఫ్లాపులతో ప్రేక్షకులకు దూరమయ్యారు. తాజాగా ఆయన నటించిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రం విడుదలకాబోతోంది. బాలీవుడ్ హిట్ సలాం నమస్తే ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి కన్మణి దర్శకుడు. విమలారామన్ హీరోయిన్ గా చేస్తోంది.రాజు హర్వాణి, గోగినేని శ్రీనివాస్ నిర్మాతలు. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''రెండు మనసుల్ని జీవితకాలం కలిపి ఉంచే బలమైన బంధం వివాహం. ఆ బంధం ఎప్పటికీ పదిలంగా ఉండాలంటే రెండు మనసుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. అంటే పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్యా రాదు. ఒక వేళ అభిరుచులు కలవకపోతే జీవితం ఎంత గందరగోళంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశామ''న్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం, కాశీ విశ్వనాథ్, చిత్రం శ్రీను, విజయ్‌సాయి, ప్రగతి, రక్ష తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్.


Click it and Unblock the Notifications











