సాహోలో మరో బాలీవుడ్ నటుడు.. ప్రభాస్ హీరోయిన్ ఇంకా సస్సెన్సే.. ఫైనల్‌గా ఆమెనట..
బాహుబలి తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రంలో బాలీవుడ్ నటుల జాబితా పెరిగిపోతున్నది. ఇప్పటికే నీల్ నితిన్ ముకేష్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా చంకీ పాండేని ఈ చిత్రంలో ఓ క
బాహుబలి తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రంలో బాలీవుడ్ నటుల జాబితా పెరిగిపోతున్నది. ఇప్పటికే నీల్ నితిన్ ముకేష్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా చంకీ పాండేని ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. దర్శకుడు చెప్పిన కథ విని చంకీ చాలా ఇన్స్ఫైర్ అయ్యారు. ఫ్యూచరిస్టిక్ సినిమాలో నటించడానికి ముందుకు వచ్చాడు. సాహోలో చంకీ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అద్భుతమైన కామెడీ పండించడానికి స్కోప్ ఉంటుంది అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.

కామెడీ కింగ్‌గా చంకీపాండే
90వ దశకంలో చంకీ పాండే తనదైన కామెడీతో ఆకట్టుకొన్నాడు. తేజాబ్, ఆంఖే చిత్రాలు ఆయన నటనకు అద్దం పట్టాయి. చాలా ఏళ్ల నుంచి చంకీ పాండే సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల విద్యాబాలన్ నటించిన బేగం జాన్ అనే చిత్రంలో కనిపించాడు.
Recommended Video


బేగం జాన్‌లో అదుర్స్
బేగం జాన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. సినిమాలో చంకీపాండే పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన నటనను చూసి సాహోలో ఓ పాత్రకు నిర్మాతలు సంప్రదించడం, అందుకు ఆయన ఒప్పుకోవడం జరిగిపోయాయి. సాహో చిత్రాన్ని జాతీయ స్థాయి చిత్రంగా మలిచే క్రమంలో బాలీవుడ్ నటీనటులను నటింపజేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ నేషనల్ స్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే.

మళ్లీ కత్రినా వైపు చూపు.
ప్రభాస్ సరసన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటింపజేసేందుకు తొలుత శ్రద్దా కపూర్, దిశపటానీ, కత్రినాను సంప్రదించారు. అయితే బాహుబలికి ముందు ప్రభాస్ పక్కన నటించడానికి కత్రినా తిరస్కరించిందట. శ్రద్ధాకపూర్, దిశా పటానీ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వారిని పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చినప్పటికీ ఆమెను తప్పించినట్టు వార్తలు షికారు చేశాయి.

తేలని హీరోయిన్ వ్యవహారం..
అయితే సాహో చిత్రంలో హీరోయిన్ ఇంకా ఎవరన్నది సస్పెన్స్‌గానే మారింది. లావు ఎక్కువగా ఉన్న కారణంగా అనుష్కను తప్పించారు అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే అనుష్క వ్యవహారంపై నిర్మాతలు, చిత్ర యూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా కత్రినా కైఫ్‌తో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











