సంపూర్ణేష్ బాబు క్లాప్‌తో ‘చున్ని’ (ఫోటోలు)
హైదరాబాద్ : వెంకీ, చందు, కథానాయకులుగా నటిస్తున్న చున్ని చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓం శ్రీ గురురాఘవేంద్ర క్రియేషన్స్ పతాకంపై వెంకీ నిర్మిస్తున్నారు. జె.మోహన్‌కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. మిత్రా కథానాయిక. నాయకానాయికలపై చిత్రీకరించిన మూహూర్తపు సన్నివేశానికి నటుడు సంపూర్ణేష్‌బాబు క్లాప్ నిచ్చారు.
సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'హృదయ కాలేయం' చిత్రం ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంతో సంపూర్ణేష్ బాబు బాగా పాపులర్ అయ్యారు. దీంతో సినిమా ప్రారంభోత్సవానికి అతన్నే గెస్టుగా ఆహ్వానించారు.
'చున్ని' సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

దర్శకుడు మాట్లాడుతూ..
చున్ని చిత్రాన్ని సైంటిఫిక్ లవ్‌స్టోరీగా ఓ భిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నామని దర్శకుడు మోహన్ కాంత్ తెలిపారు. యువతరంతో పాటు కుటుంబ వర్గాలు మెచ్చే అంశాలున్న చిత్రమిది. వినోదం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు.

స్టోరీ లైన్...
అనుకోని పరిస్థితుల్లో అమ్మాయిగా మారిన ఓ యువకుడు చేసే హంగామా ఏమిటనేది ఈ సినిమా స్టోరీ లైన్.

షూటింగ్ వివరాలు
ఆగస్టు 6 నుంచి 17 వరకూ సాగే తొలి షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్‌లో సాగుతుంది

ఈ కార్యక్రమంలో...
చందు, సుభాష్‌ఆనంద్, జయ.జి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మహేంద్రనాథ్, సంగీతం: సుభాష్ ఆనంద్, మాటలు: చింతా శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











