twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశం గర్వించేలా చేశావు.. కంగ్రాట్స్.. సింధుపై సినీ ప్రముఖుల ప్రశంసలు

    |

    Recommended Video

    Tollywood Celebs Tweets On P.v.Sindhu's Victory || Filmibeat Telugu

    ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం గెలిచి తొలి భారత షట్లర్‌గా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పీవీ సింధు నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పొగుడుతూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ మేరకు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, నాగార్జున, అనుష్క శర్మ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సహా పలువురు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. అందులో కొన్ని ట్వీట్ చూస్తే..

    మేం గర్వించేలా చేశావు.. విజయ్ దేవరకొండ

    ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళ పీవీ సింధు. కంగ్రాట్స్‌ ఛాంపియన్‌. మేం గర్వించేలా చేశావు.

    మహేష్ బాబు ట్వీట్

    పీవీ సింధు మన బంగారు రాణి.. హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నా. ఈ చిరస్మరణీయ విజయంపై చాలా గర్వంగా ఉంది.

    నాగార్జున ట్వీట్

    ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి భారత్‌కు బంగారు పతాకం గెలుచుకొని తెచ్చిన గోపీచంద్‌, సింధుకు శుభాకాంక్షలు.

    మంచు విష్ణు ట్వీట్

    ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుపొందిన పీవీ సింధుకు హృదయ పూర్వక అభినందనలు. ఎస్.. ఎస్.. సూపర్.

    నీ పట్ల చాలా గర్వంగా ఉంది.. రకుల్

    దేశంలోని ఎంతోమందికి ఈ విజయం స్ఫూర్తిదాయకం. నీ పట్ల చాలా గర్వంగా ఉంది. దేశం గర్వించేలా చేశావు. శుభాకాంక్షలు సింధు.

    ఛార్మి ట్వీట్

    సింధు ఓ ఆడపులి.. ఎంత గొప్పగా ఆడారు. కంగ్రాట్స్.. నీకు ప్రత్యేక శుభాకాంక్షలు.

    మోహన్‌ బాబు ట్వీట్

    ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించిన సింధుకు ప్రత్యేక అభినందనలు. మరోసారి మన దేశం గర్వించేలా చేశావు. నీవు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా.

    English summary
    Cine celebrities congratulated PV Sindhu after she became the first Indian to win a gold medal at the BWF World Championships in Basel, Switzerland. Sindhu exacted a sweet revenge against Nozomi Okuhara of Japan as the Indian demolished her 21-7, 21-7 in just 38 minutes to bag the top honours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X