twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తీవ్ర విషాదం: అఖండ చూస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్.. బాల‌య్య వీరాభిమాని, ప్రముఖ ఎగ్జిబిట‌ర్ మృతి..

    |

    నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకుంటున్న ఈ సినిమా గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

     59 కోట్ల ప్రీ రిలీజ్

    59 కోట్ల ప్రీ రిలీజ్

    అఖండ మొత్తంగా 59 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తూ ఉండగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలంటే మొత్తంగా 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చిన షేర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఈ వారంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజే అఖండ 15.39కోట్ల షేర్ రాబట్టి బాలయ్య బోయపాటి కెరీర్ లోనే సంచలన రికార్డు నమోదు చేసింది.

    22 కోట్లకు పైగా షేర్

    22 కోట్లకు పైగా షేర్

    సెకండ్ వేవ్ అనంతరం లవ్ స్టోరీ సినిమా రికార్డులు అఖండ బ్రేక్ చేసినట్లు అర్ధమైపోయింది. అలా రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 6.83కోట్ల షేర్ వచ్చింది. అంటే రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 22 కోట్లకు పైగా షేర్ సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 30 కోట్లకు పైగా షేర్ సాధించాల్సి ఉంటుంది.

    బాలయ్య అభిమాని

    బాలయ్య అభిమాని

    ఆ సంగతి పక్కన పెడితే అఖండ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన వారంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఓ ఎగ్జిబ్యూటర్ హఠాన్మరణం చెందడంతో విషాదం నెలకొంది. తూర్పు గోధావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్‌, స్వయానా బాలయ్య అభిమాని అయిన జాస్తి రామకృష్ణ హఠాన్మరణం చెందారు.

    బ్రెయిన్‌ స్ట్రోక్ వచ్చి

    బ్రెయిన్‌ స్ట్రోక్ వచ్చి

    సినిమా విడుదలైన గురువారం రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లో అఖండ సినిమా చూస్తుండగా ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్ వచ్చింది. దీంతో రామకృష్ణ థియేటర్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే ధియేటర్ యాజమాన్యం వెంటనే రామకృష్ణను నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించింది. ఐతే రామకృష్ణ అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు.

     సుపరిచితులు

    సుపరిచితులు

    ఇక రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్‌ మహల్‌ థియేటర్‌ ఓనర్ గా, జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడిగా, వింటేజ్‌ క్రియేషన్స్‌ అధినేతగా, జేకే రెస్టారెంట్‌ అధినేతగా జిల్లాలో అందరికి జాస్తి రామకృష్ణ సుపరిచితులు. ఆయనకు భార్య శిరీష, ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. జాస్తి రామకృష్ణ హఠాన్మరణం గురించి తెలిసిన వెంటనే పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

    థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌

    థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌

    అఖండ మూవీకి థ‌మ‌న్ మ్యూజిక్ అందించ‌గా.. కొన్ని థియేట‌ర్ల‌లో థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు సౌండ్ బాక్స్‌ల నుంచి పొగ‌లు కూడా వ‌స్తున్నాయి. అందులో భాగంగానే వరంగల్ లో ఒక థియేటర్ లో పొగలు రావడంతో వెనువెంటనే సినిమా నిలిపివేసి మరీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఏపీలో టికెట్ రేట్లు నార్మల్ గా ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉంటాయని అంటున్నారు.

    English summary
    cine exhibitor Jasti Ramakrishna died while watching akhanda in rajamundry
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X