చిన్న తెరపై పెద్ద హీరోయిన్లు

వెండితెరైనా, బుల్లితెరైనా మాకు ఒకటే. అంటూ ముదర హీరోయిన్లు ఓ చిన్నపాటి స్టేట్‌మెంట్లు ఇచ్చి బుల్లి తెరపైకి దూకేస్తున్నారు. దాంతో రెండుమూడేళ్ల క్రితం వెండితెరపై రాణించిన హీరోయిన్లంతా ప్రస్తుతం టీవీ తెరపై దర్శనమిస్తున్నారు. అసలు హీరోయిన్లు టీవీ కార్యక్రమాల్లో నటించడం అన్న ఈ సాంప్రదాయం తొలుత తమిళంలో ప్రారంభమై ప్రస్తుతం తెలుగు ఛానెల్స్‌కు కూడా వ్యాపించింది. సినిమాల్లో అవకాశాలు లేక గోర్లు గిల్లుకుంటున్న నవనీత్ కౌర్, తనూ రాయ్ ,నికిత లాంటి వారు ఓ టీవీ ఛానెల్‌లో ఒళ్లంతా కనిపించేలా స్టేజ్ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అలనాటి వ్యాంప్ నటీమణి జ్యోతిలక్ష్మి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరో ప్రక్క వేరే ఛానెల్‌లో 'గులాబీ' చిత్రంతో తెలుగుతెరపై క్రేజ్ సంపాదించిన మహేశ్వరి తనకు సహజమైన అసజ నటనతో ప్రధాన పాత్ర లో పోషిస్తూన్న ఓ సీరియల్ ప్రసారమవుతోంది.
అయితే తెలుగు ఛానెల్స్‌లో ఈ హీరోయిన్ల ప్రవాహం ఇప్పుడిప్పుడే ప్రారంభం కాగా తమిళంలో మాత్రం దాదాపు ప్రతీ ఛానెల్‌లో హీరోయిన్లు దర్శనమిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇకపై సినిమాల్లో అవకాశాలు లేనివారంతా బుల్లితెరపై చేరిపోనున్నారన్నమాట. ఇలా సినిమావారంతా టీవీ వైపు వచ్చేస్తుంటే ఇక కొత్తవారికి చోటేదని వర్ధమాన టి.వి.తారులు వాపోతున్నారు. ఎందుకంటే సినిమా స్టార్లు కున్న క్రేజ్ తో టి.ఆర్.పి.రేటింగ్ లు పెరుగుతాయి. అదే అలవాటుపడిన ఫేసులు,మూస నటన కన్నా వీరు బెటర్ కదా కొంతలో కొంత ఎక్స్ ప్రెషన్స్ కనపడతాయి. దాంతో టి.వి.దర్శకులూ ..నిర్మాతలూ హ్యాపీస్.


Click it and Unblock the Notifications











