సినీ జర్నలిస్టు మోహన్ కుమార్ మృతి
సీనియర్ సినీ జర్నలిస్టు బి. మోహన్‌కుమార్ (70) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. 1942 ఫిబ్రవరి 1న జన్మించిన ఆయన ఇరవై రెండేళ్ల వయసులో ఆంధ్రపత్రికలో సినిమా రిపోర్టర్‌గా చేరడం ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత పలు దినపత్రికలు, సినీ వారపత్రికల్లో పనిచేశారు. 1976లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరి ఏడాది పాటు సినిమా రిపోర్టర్‌గా చేసి ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి అనుబంధంగా వెలువడిన జ్యోతిచిత్ర సినీ వారపత్రికలో చీఫ్ రిపోర్టర్‌గా ఐదేళ్లు, ఇన్‌చార్జి ఎడిటర్‌గా ఎనిమిదేళ్లపాటు సేవలందజేశారు.
తెలుగులో మొట్టమొదటి ఫిల్మ్ వీక్లీ అయిన చిత్రాలయ ఆయన ఇన్‌చార్జి ఎడిటర్‌గానే ప్రారంభమైంది. ఎంతోమంది సినీ పాత్రికేయులు ఆయన శిష్యరికంలో వెలుగులోకి వచ్చారు. చిత్రసీమలోని పెద్ద పెద్ద నటులు, దర్శకులు, నిర్మాతలతో ఆయనకు సన్నిహిత అనుబంధం ఉంది. ఆయన మృతిపట్ల పలువురు చిత్రసీమ ప్రముఖులు, సినీ పాత్రికేయులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications