భాను కిరణ్ ల్యాప్‌టాప్ లో తారల నగ్న ఫోటోలు?
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ ల్యాప్‌టాప్‌లో కొంత మంది వర్ధమాన తారల నగ్న ఫొటోలు ఉన్నట్లు తెలుస్తోంది. భాను కిరణ్ ల్యాప్‌టాప్‌లో భాను కిరణ్‌కు చెందిన పలు రహస్యాలు ఉన్నట్లు భావిస్తున్నారు. భాను కిరణ్ ల్యాప్‌టాప్‌ను పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో భాను వ్యవహారాలు చాలా ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలుగు సినీ రంగంపై పట్టు సాధించాలనేది భాను కిరణ్ లక్ష్యంగా చెబుతున్నారు. అందులో భాగంగానే కొంత మంది తెలుగు నిర్మాతలతో ఆయన సంబంధాలు పెట్టుకుంటున్నాడని అంటున్నారు. ఖలేజా, పోకిరి, కొమురం పులి, రక్తచరిత్ర సినిమాలకు పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంత మంది నిర్మాతల పేర్లు కూడా భాను కిరణ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చాయి. సి. కళ్యాణ్, సింగనమల రమేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వారు భానుతో సంబంధాలపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఇద్దరు నిర్మాతలను పోలీసులు విచారించినట్లు కూడా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











