twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కష్టకాలంలో ఆదుకున్న తారలు.. సినీ కార్మికులకు అండగా సెలెబ్రిటీలు

    |

    కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. తినడానికి తిండి లేక ఎంతో మంది బిక్కుబిక్కుమన్నారు. ముఖ్యంగా రోజూ వారి వేతనంతొ కాలం వెళ్లదీసే సినీ కార్మికుల ఎంతో వేదనకు గురయ్యారు. షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా సినీ తారలంతా ముందుకు వచ్చారు. అన్ని ఇండస్ట్రీల్లో తమ తమ కార్మికులను ఆదుకునేందకు సెలెబ్రిటీలు ముందుకు వచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీలో స్టార్స్ అంతా ముందుకు వచ్చి సాయం చేశారు.

    బాలీవుడ్‌లో ఉన్న 25 వేల మంది కార్మికులను నేరుగా వారి వారి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లేలా సల్మాన్ ఖాన్ ఏర్పాటు చేశారు. షారుఖ్ ఖాన్ తన సంస్థల ద్వారా ఎంతో మందికి సాయం అందించారు. సోనూసూద్ వంటి నటులైతే ఇప్పటికీ సాయం చేస్తూనే ఉన్నాడు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేసిన తరుణంలో ఆకలి కేకలు లేకుండా చూశాడు. ప్రస్తుతం వలస కార్మికులను స్వగృహాలకు పంపించేందుకు కంకణం కట్టుకున్నాడు. ఇక దక్షిణాదినా దినసరి కార్మికులను ఆదుకునేందుకు తారలంతా విరాళాలు అందించారు.

    Cine Workers Were Helped By Star Heroes During Covid 19 pandemic

    టాలీవుడ్ సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించారు. తెలుగు సినీ తారలంతా విరాళం అందించగా.. దాదాపు 8 కోట్ల మేర సేకరించారు. వీటిలో సినీ కార్మికులందరికీ నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ఈ డబ్బుతోనే గత మూడు నెలలుగా వారికి సరకులు అందిస్తూ వస్తున్నారు. తమిళనాట ఫెఫ్సీ సంస్థ ద్వారా కార్మికులను సాయం అందించారు. లారెన్స్ వంటి వారు మూడు కోట్ల విరాళంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఇలాంటి విపత్కర కాలంలో అందరూ కలిసి సినీ కార్మికులను ఆదుకున్నారు.

    English summary
    Cine Workers Were Helped By Star Heroes During Covid 19 pandemic. All Industries Come together And Helped daily wage workers in film indusrty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X