ఈ వీకెండ్: ‘మిర్చి’ ఘాటు.... నకిలి, ఎబిసిడి
హైదరాబాద్: వీకెండ్ వచ్చిదంటే చాలు ఏదో ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంటుంది. వారాంతం కావడంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా మంది నిర్మాతలు వీకెండ్లో సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ వారం కూడా పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అందులో ప్రభాస్ 'మిర్చి', ప్రభుదేవా 'ఎబిసిడి', నకిలి అనే మరో సినిమా విడుదలవుతోంది.
1. మిర్చి: ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'మిర్చి' చిత్రం రేపు(ఫిబ్రవరి 8)న గ్రాండ్‌గా విడుదలవుతోంది. కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.
2. ఎబిసిడి: కొరియోగ్రాఫర్‌గా తెరంగ్రేటం చేసి సత్తా చాటిన ప్రభుదేవా... ఆపై నటుడిగాను అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడిగా తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇట్టే ఇమిడి పోతున్న ప్రభుదేవా డాన్స్ ప్రధానంగా కొనసాగే 'ABCD (ఎనీ బడీ కెన్ డాన్స్)' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం డాన్స్ మాస్టర్ రేమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతోంది. శివప్రసాద్, పి.కిశోర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రభుదేవా హై ఓల్టేజ్ డాన్సులు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయని నిర్మాతలు తెలిపారు. భారతీయ తెరపై రూపొందిన తొలి డాన్స్ 3డి మూవీ ఇది. ఈ శనివారం(ఫిబ్రవరి 9) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
3. నకిలి: సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ప్రధానపాత్రలో ఫాంటసీ ఫిలిమ్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం 'నకిలి'. తమిళంలో విజయవంతమైన 'నాన్' చిత్రాన్ని తెలుగులో అనువదించారు. సిద్ధార్థ, వినయ్‌పాల్, రూప, మనోజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, పాటలు: చంద్రబోస్, భువనచంద్ర, వనమాలి, సంగీతం: విజయ్ ఆంథోని, నిర్మాతలు: రాజశేఖర్, చినబాబు, కథ, స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం: జీవాశంకర్.


Click it and Unblock the Notifications











