‘సినిమా చూపిస్త మావ’ ప్రారంభం

By Bojja Kumar

హైదరాబాద్: ‘ఉయ్యాల...జంపాల' ఫేం రాజ్ తరుణ్ హీరోగా....అంజిరెడ్డి ప్రొడక్షన్స్-ఆర్.డి.జి ప్రొడక్షన్స్ ప్రై.లి సంయుక్త సమర్పణలో-ఆర్యత్ సినీ ఎంటర్టెన్మెంట్స్-లక్కీ మీడియా బ్యానర్స్ పై బోగాది అంజిరెడ్డి-బొక్కెం వేణుగోపాల్(గోపి)-రూపేష్ డి.గోవిల్-శ్రీమతి జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సినిమా చూపిస్త మావ'.

ఉయ్యాల..పంపాలా ఫేం రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెబల్ స్టార్ కృష్ణరాజు సతీమణి శ్యామలతో పాటు, నిర్మాతల్లో ఒకరైన శ్రీమతి జి.సునీత పూజా కార్యక్రమాలు నిర్వహించగా..యువ కథానాయకుడు సందీప్ కిషన్ సినిమా స్క్రిప్టును దర్శకుడు త్రినాథరావుకు అందించారు.

అనంతరం హీరో రాజ్ తరుణ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు.

Cinema Choopista Maava opening

‘మావకు మార్నింగ్ షో వేసి, మళ్లీ ఫోన్ చేస్తా. ఆట అయిపోయేసరికి సూపర్ హిట్ గ్యారంటీ' అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగుతో ముహూర్తపు సన్నివేశాన్నిచిత్రీకరించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో...‘అంజిరెడ్డి ప్రొడక్షన్స్' అధినేత బోగాది అంజిరెడ్డి, ‘ఆర్.డి.జి ప్రొడక్షన్స్ అధినేత రూపేష్ డి.గోహిల్, ఆర్యన్ సినీ ఎంటర్టెన్మెంట్స్ అధినేత రాజశేఖర్ రెడ్డి, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు త్రినాథరావు నక్కిన, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్, డైలాగ్ రైటర్ ప్రసన్న జె.కుమార్, స్క్రిప్టు కో-ఆర్టినేటర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ...‘మావగారిగా డైలాగ్ కింగ్ సాయి కుమార్, బావమరుదులుగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, కమెడియన్ సప్తగిరి నటిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ ను రెండు మూడు రోజుల్లో ఎంపిక చేసి, ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్, మల్లిడి సత్యనారాయణరెడ్డి, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రామ్మోహన్.పి, వివేక్ కూచిబొట్ల, రాజ్ కుమార్, బెల్లం రామకృష్ణారెడ్డి, లక్ష్మణ క్యాదారి, యువ కథానాయకులు నాగ శౌర్య, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి పిఆర్: ధీరజ అప్పాజీ, మేకప్: గంగాధర, పోస్టర్స్ డిజైనింగ్: విక్రమ్, స్టైలింగ్: ఖుషి శ్రీరామ్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X