twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సినిమా గా సినిమా’ పుస్తకావిష్కరణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సినియర్ జర్నలిస్టు నాదెళ్ల నందగోపాల్ రచించిన 'సినిమాగా సినిమా' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్ఎఫ్‌సిసిలో జరిగింది. ప్రముఖ సినీ రచయిత సి నారాయణరెడ్డి చేతుల మీదుగా తొలి ప్రతిని విడుదల చేసారు. ఈకార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డి రామానాయుడు, ఎంఎల్‌సి నన్నపనేని రాజకుమారి, కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసాద్స్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సినారె మాట్లాడుతూ పుస్తకం పేరు చిత్ర విచిత్రంగా గొప్పగా ఉంది. సినిమా రంగంలో చాలా కృషి చేసిన నాదెళ్ల నందగోపాల్ ఈ పుస్తకం ద్వారా సినిమా రంగానికి చెందిన అన్ని పార్శాలను టచ్ చేసారు. అచ్చు చేసిన హనుమంతరావు అభినందనీయులు అన్నారు.

    Cinema Ga Cinema book launch

    డి.రామానాయుడు మాట్లాడుతూ నందగోపాల్ తనకు చాలా సంవత్సరాల నుండి పరిచయమని, ఆ రాసిన ఈ పుస్తంగా గొప్పగా ఉందని తెలిపారు. సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ నందగోపాల్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లకు సినిమా రంగంలో ఆత్మీయులు. ఆయన రచించిన ఈ పుస్తకాన్ని పరుచూరి హనుమంతరావుకు అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంది అన్నారు.

    సినిమా రంగంలోని పరిణామ క్రమాన్ని ఈ పుస్తకంలో వివరించారు. హనుమంతరావు ప్రోత్సాహం వల్లనే ఈ పుస్తకం రాసానని, ఈ పుస్తకం కోసం ఐదేళ్లు కష్టపడ్డట్లు రచయిత నాదేళ్ల నందగోపాల్ వెల్లడించారు. పరుచూరి హనుమంతరావు మాట్లాడుతూ...ఈ పుస్తకంలో నందగోపాల్‌కు తెలిసిన సినిమా వివరాలన్నీ పొందు పరిచారు. తెలుగు యూనివర్శిటీ వారు దీన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చుతామని చెప్పారు అని తెలిపారు.

    English summary
    Cinema Ga Cinema book launched by C. Narayana Reddy. D. Ramanaidu, K.S. Ramarao, Tammareddy Bharadwaja, Saripalli kondal Rao, Cortonist Jayadev graced the event. Cinema Ga Cinema book written by senior journalist Nanda Gopal Nadendla.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X