twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా అంటే ఆషామాషీ కాదు-తెలంగాణ వాదులకు హెచ్చరిక

    By Sindhu
    |

    ఓ ఫ్యాక్టరీ కట్టుకున్నట్టో, ఇంకో పరిశ్రమ నెలకొల్పినట్టో, మరో నగరాన్ని నిర్మించినట్లో కాదు. సినీ పరిశ్రమ పూర్తిగా ప్రత్యేకమైనది. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కమెడియన్. ఇదే కాదు సినీ పరిశ్రమ అంటే లక్షలాదిమందికి ఉపాధిని కల్పించేదే సినీ పరిశ్రమ. అలాంటి సినీ పరిశ్రమను చెన్నయ్ నుంచి హైద్రాబాద్ కి రప్పించడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది" అంటూ సినీ పరిశ్రమ గురించి ముఖ్యమంత్రి రోశయ్య ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చారు.

    లోకల్ ఎంప్లాయ్ మెంట్ తో పాటు, ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే సినీ పరిశ్రమ ఇప్పుడు రాష్ట్రంలో విభజన సెగల కారణంగా సంక్షోభంలో పడిపోయిందని రోశయ్య అంటున్నారు. సినిమా షూటింగులపై దాడుల ద్వారా సినీ పరిశ్రమ చెన్నయ్ కు తరలి వెళ్ళేందుకు సమాయత్తమవుతోందనీ, ఈ పరిస్థితుల్లో సినీ పరిశ్రమను బుజ్జగించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా వుందని రోశయ్య అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్ లో షూటింగ్ చేసుకోకపోతే వాళ్ళకు వచ్చే నష్టమేమీ లేదు. అదే షూటింగ్ బెంగళూరుకి షిఫ్ట్ చేసేయగలరు. తద్వారా మనకొచ్చే ఆదాయం తగ్గుతుంది. మన నగర ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అంటూ రోశయ్య వేర్పాటువాదులకు పరోక్షంగా చురకలంటించారు.

    చెన్నయ్ లో ఇప్పటికీ తమకు ఆస్తులు వున్నాయనీ, అక్కడికే తిరిగి వెళ్ళేందుకు తమకేమీ ఇబ్బందుల్లేవనీ, తమిళ సర్కార్ రాయితీలు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదనీ సినీ పరిశ్రమలో వార్తలు విన్సిస్తున్నాయనీ, ఈ పరిస్థితుల్లో సినీ పరిశ్రమను వదులుకోవడం మంచిదికాదనీ రోశయ్య అంటున్నారు. సినీ పరిశ్రమలో ప్రాంతాలకతీతంగా అందరూ పనిచేస్తున్నారనీ, నటులకి ప్రాంతీయుతను అంటగట్టడం దురదృష్టకరమనీ, మహేష్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ, అల్లు అర్జున్ గానీ, మనోజ్ గానీ, సమైక్యాంద్ర నినాదం చేయలేదనీ, అలాంటప్పుడు వారి సినిమా షూటింగుల్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని రోశయ్య ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి, మోహన్ బాబు సమైక్య నినాదం చేశారు కాబట్టి అల్లు అర్జున్, మనోజ్ సినిమాల్ని అడ్డుకున్నా, మహేష్ సినిమాల్ని అడ్డుకోవడంలో వేర్పాటువాదుల ఔచిత్యమేంటని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X