‘సినిమా పోస్టర్’ పుస్తకావిష్కరణ

By Bojja Kumar

సీనియర్ చిత్రకారుడు ఈశ్వర్ రూపొందించిన 'సినిమా పోస్టర్" పుస్తకాన్ని పలువురు సినీ ప్రముఖులు ఆవిష్కరించారు. దాసరినారాయణరావు 'సినిమాపోస్టర్" పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డి. రామానాయుడుకు అందజేశారు. ఈ పుస్తకం గురించి రూపకర్త ఈశ్వర్ మాట్లాడుతూ 'పోస్టర్ తయారు చేసే విధానంలో కాలంతో పాటు కొత్త విధానాలు చోటు చేసుకున్నాయి. ముందు తరాలకు పోస్టర్ గురించి తెలియజేయాలనే ఆలోచనతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దీని కోసం మూడు సంవత్సరాలు కృషి చేశాను. ఈ ప్రయత్నంలో నాకు ఎంతో మంది సహకారం అందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన విజయా పబ్లికేషన్స్ అధినేత విశ్వనాధ్‌డ్డి గారికి, ఈ కార్యక్షికమంలో పాల్గొన్న వారందరికీ నా కృతజ్ఞతలు"అన్నారు.

ఈశ్వర్ గురించి దాసరి నారాయణ రావు మాట్లాడుతూ తన కుంచెతో జనానికి కనిపించిన కళాకారుడు ఈశ్వర్. ఆయన ఆనుభవాన్ని రంగరించి ఈ పుస్తకాన్ని భావితరాల కోసం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్షికమంలో సి.అశ్వనీదత్, మురారి, గొల్లపూడి మారుతీరావు, కె. రాఘవేంవూదరావు, ఆదిశేషగిరిరావు, ప్రసన్నకుమార్, మురళీమోహన్, తనికెళ్ళభరణి, అర్జునరాజు కె.సి.శేఖర్‌బాబు, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X