లాక్ డౌన్ తరువాత కూడా అదే పరిస్థితి.. సినిమా షూటింగ్స్ ఇప్పట్లో లేనట్లే..?

కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం మొత్తం ఎంతో కష్టపడి పోరాడుతోంది. మునుపెన్నడు చూడని విధంగా కరోనా అనే వైరస్ భూగోళాన్ని వణికిస్తోంది. చావు భయంతో అగ్ర రాజ్యాలు కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. వారం రోజుల్లోనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్క దేశం లాక్ డౌన్ ద్వారా ఉపశమనం పొందుతోంది. అయితే ఈ క్రమంలో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆకలి బాధలు..

ఆకలి బాధలు..

కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా నాయకులు లాక్ డౌన్ ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆకలి బాధలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమల్లో కూడా రోజువారీ కూలీలు ఆర్థికంగా చాలా వెనుకబడిపోయారు. రోజు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఇండస్ట్రీలో పెద్దలు వారికి అండగా నిలిచేందుకు సహాయపడుతున్నారు.

షూటింగ్స్ ఇప్పట్లో లేనట్లే..

షూటింగ్స్ ఇప్పట్లో లేనట్లే..

కరోనా లాక్ డౌన్ మే నెలలో ఎండ్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే కరోనా మహమ్మారి ఇంకా సీరియస్ గా మారుతోంది. అయితే దాన్ని అరికట్టేందుకు కొన్ని కండిషన్స్ ద్వారా షూటింగ్స్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా కొంతమంది సినీ పెద్దలకు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఒక షూటింగ్ లో 20 మంది కంటే ఎక్కువ ఉండకుండా షూటింగ్స్ చేసుకునే వెసులుబాటు కలిపించాలని చర్చించుకున్నారట.

 అలా అయితే పెద్ద సినిమాలకు కష్టమే..

అలా అయితే పెద్ద సినిమాలకు కష్టమే..

ఒక సినిమా షూటింగ్ జరగాలంటే పెద్ద సినిమాలకు రోజుకి వందల మంది పని చేసిన సందర్భాలు ఉన్నాయి. కనీసం 50 మంది ఉంటే గాని కొన్ని పనులు జరగవు. అలాంటిది కరోనా భయంలో కొద్దీ మందితో సినిమా చేయడం అనేది అంత సులువు కాదు. ఈ విషయంపై సినీ పెద్దలు మరోసారి ఆలోచించే అవకాశం ఉంది.

Recommended Video

Karma Yogi Movie Official Teaser
 జులై వరకు నో షూటింగ్స్..

జులై వరకు నో షూటింగ్స్..

కుదిరితే జులై ఎండింగ్ వరకు షూటింగ్ చేయకూడదని చాలా మంది సినిమా సభ్యులు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిస్క్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించి కొన్నాళ్లపాటు షూటింగ్స్ చేయకుండా సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని ఆలోచిస్తున్నారట. అందుకే ఆగస్ట్ నుంచి పరిస్థితులు చక్కబడిన తరువాత రెగ్యులర్ షూటింగ్స్ ని స్టార్ట్ చేయాలని కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X