న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా సెలబ్రిటీలు

ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటన నేపథ్యంలో సినీ సెలబ్రిటీలంతా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబంతో పాటు, కపూర్స్, ఖాన్స్, రోషన్స్ ఇలా....తారలంతా కూడా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల టాప్ సెలబ్రిటీలంతా దీపావళి, క్రిస్ మస్ బాష్‌ల పేరుతో పెద్ద పెద్ద పార్టీలు చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకలను కూడా అదే రేంజిలో చేద్దామని అంతా ప్లాప్ చేసుకున్నారు. అయితే దేశం మొత్తాన్ని కలిచి వేసిన ఢిల్లీ యువతి గ్యాంగ్ రేప్, ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.
మరో వైపు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అందుకు ఢిల్లీ రేప్ సంఘటన ఓ కారణమైతే, ఇది మన సంస్కృతి కాదనే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో ఎవరూ న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు.


Click it and Unblock the Notifications