‘ఆయన మహాపండితుడట .. అతడిది చిరంజీవి స్థాయా?’ గరికపాటిపై ఘాటుగా
అప్పట్లో చిరంజీవి, అధ్యాత్మిక గురువు గరికపాటి మధ్య జరిగిన వివాదం మీడియాలో సంచలనం రేపింది. చిరంజీవిపై నోరుపారేసుకొన్న గరికపాటి విమర్శకలకు గురి కావడమే కాకుండా అత్యంత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ వివాదంపై అప్పట్లో పలువురు స్పందించారు. ఓ సందర్భంలో సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు చేసిన స్పీచ్ వైరల్ అయింది. తాజాగా ఆ వీడియో య్యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..
మూడున్నర దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు టాలీవుడ్‌ను దున్నేస్తున్న సమయంలో ఓ మెరుపులా దూసుకొచ్చారు చిరు. తన ఫైట్‌లు, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీతో నాటి యువతను కట్టిపడేశారు. శరీరాన్ని పాదరసంలా మెలికలు తిప్పుతూ చిరంజీవి చేసే డ్యాన్స్‌కు ప్రేక్షకులు మైమరిచిపోయారు. తెలుగు సినిమా మార్కెట్ పెంచడంలోనూ, ఓ స్థాయికి తీసుకురావడంలోనూ చిరంజీవిది కీలకపాత్ర. వసూళ్ల కుంభవృష్టి కురిపించినా, కోటి రూపాయలు తీసుకున్న తొలి నటుడిగా అనిపించుకున్నా అది మెగాస్టార్‌కే సాధ్యం.

తను హీరోగా నిలబడటంతో పాటు ఓ డజన్ మంది మెగా కాంపౌండ్ నుంచి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశారు. స్వయంకృషితో శిఖరాగ్రాలను చేరుకోవచ్చని నిరూపించారు చిరు. ఆయన చూపిన బాటలో ఎందరో దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సినీరంగ ప్రవేశం చేశారు. వీరి అందరికీ మెగాస్టార్ దైవ సమానులు.. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే వాళ్ల ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఎదురుగా ఉన్నది ఏ స్థాయి వ్యక్తయినా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేయాల్సిందే.
ముఖ్యంగా చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు అన్నయ్యపై ఈగ వాలనివ్వరు. మెగాస్టార్ జోలికి వస్తే ఏ వేదికైనా సరే కౌంటర్ ఇచ్చే దాకా వదిలిపెట్టరు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. వీరిలాగే ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడుకు చిరు అంటే ప్రాణం. ఎవరిని లెక్క చేయని ఆయన చిరంజీవిని అమితంగా గౌరవిస్తారు. మెగాస్టార్ నటించిన తొలి సినిమా నుంచి నేటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమాకు తాను అసిస్టెంట్‌గానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చిరంజీవితో ట్రావెల్ చేశానని చోటా కే నాయుడు ఎన్నోసార్లు చెప్పారు. మనం చూసే వ్యక్తులు.. మనం ఆరాధించేవాళ్ల ప్రవర్తన మీదే మన ఎదుగుదల ఆధారపడి ఉంటుందని.. తనను నిరంతరం మోటివేట్ చేసే వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు.
ఏ వేదిక మీదకు వచ్చినా చిరంజీవి గురించి రెండు ముక్కలు మాట్లాడనిదే వదిలిపెట్టరు చోటా కే నాయుడు. ఈ క్రమంలోనే ఓ స్టేజ్‌పై చిరు గురించి చెబుతూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై విరుచుకుపడ్డారు చోటా. దీనికి కారణం లేకపోలేదు.. ఓ కార్యక్రమంలో గరికపాటి మాట్లాడాల్సిన సమయంలో చిరంజీవితో ఫోటో దిగేందుకు జనం ఎగబడుతుండటంతో నరసింహారావు మెగాస్టార్‌పై సీరియస్ అయ్యారు. మీరు ఆ ఫోటో సెషన్ ఆపకపోతే.. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిరంజీవి వెంటనే వేదికపైకి వచ్చి కార్యక్రమం సాగేలా చూశారు.



Click it and Unblock the Notifications











