బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు షాక్.. డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ డిష్యూం డిష్యూం!

వరుస పరాజయాలతో విసిగిపోయిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు 2019లో ఊరట లభించింది. ఆయన నటించిన రాక్షసుడు సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో జోష్ పెరిగింది. దాంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టేశాడు. అయితే అంతా సవ్యంగా సాగుతుందనుకోనే లోపే ఓ ఝలక్ తగిలింది. ఆ చిత్రానికి పనిచేసే సినిమాటోగ్రాఫర్ అర్థాంతరంగా వెళ్లిపోవడం సినీ వర్గాల్లో చర్చానీయాంశమైంది.

బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్

బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్ జంటగా సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందే సినిమా కోసం బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డూడ్లేను ఎంపిక చేశారు. ఆయన సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే లాంటి హిట్ చిత్రాలకు పనిచేశారు. అయితే కొన్ని రోజులపాటు షూటింగ్ జరిగిన తర్వాత తాను పనిచేయలేని సినిమా నుంచి తప్పుకొన్నట్టు జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెల్లడించింది.

గుడ్ బై చెప్పడానికి కారణమేమిటంటే

గుడ్ బై చెప్పడానికి కారణమేమిటంటే

సినిమాటోగ్రాఫర్ డూడ్లే అర్థాంతరంగా తప్పుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు మధ్య చోటు చేసుకొన్న క్రియేటివ్ విభేదాలే అనే విషయం బయటకు పొక్కింది. వారిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించడానికి యూనిట్ ప్రయత్నించగా.. అవి కొలిక్కి రాకపోవడంతో షూటింగ్‌ కొనసాగించడం చాలా కష్టంగా మారిందట. దాంతో డూడ్లే ప్రాజెక్ట్‌కు గుడ్‌డై చెప్పారనేది కథనంలో పేర్కొన్నారు.

రంగంలోకి చోటా కే నాయుడు

రంగంలోకి చోటా కే నాయుడు

డూడ్లే అనూహ్య పరిస్థితుల్లో తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుని తీసుకొన్నట్టు తెలిసిందే. చోటా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమా కోసం తాత్కాలికంగా డేట్లు సర్దుబాటు చేశారనేది తాజా సమాచారం. గతవారం రోజులుగా పనిచేసిన అనంతరం చిన్న బ్రేక్ తీసుకొన్నారని.. ఒకవేళ అంతా సవ్యంగా సాగితే ఆయనే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

త్వరలోనే అధికారికంగా

త్వరలోనే అధికారికంగా

సాయి శ్రీనివాస్ సినిమా కోసం పనిచేయడానికి చోటా కే నాయుడు ఒప్పుకంటే త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దాంతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను కూడా వెల్లడించాలనే ఆలోచనలో యూనిట్ ఉందట. త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టాలనే ఆలోచనతో యూనిట్ ముందుకెళ్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X