కళ్యాణ్ రామ్ రూటులో ప్రయాణం పెట్టుకున్న రామ్
కళ్యాణ్ రామ్ తాజాగా సునీల్ రెడ్డి అనే కెమెరా మెన్ ని దర్సకుడుగా పరిచయం చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటులో హీరో రామ్ కూడా వెళ్ళనున్నారు. సంతోష్ శ్రీనివాస్ అనే కెమెరామెన్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రామ్ ఓ చిత్రం రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. రామ్ ప్రస్తుతం తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇక సంతోష్ గతంలో రవితేజతో ఖతర్నాక్, వియన్ ఆదిత్య తో రెయిన్ బో చిత్రాలు చేసారు. రెయిన్ బో చిత్రానికి మంచి కెమెరా వర్క్ అందించారంటూ మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సునీల్.కె.రెడ్డి గతంలో ఒకరికి ఒకరు, భగీరధ, నేను మీకు తెలుసా చిత్రాలకు తెలుసా చిత్రాలుకు చేసారు.
రామ్ కళ్యాణ్ రామ్ సునీల్ కె రెడ్డి సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ సురేష్ ram kalyana ram suneel k reddy santhosh srinivas bellam konda


Click it and Unblock the Notifications