»   » సినీ ప్రముఖుడు శ్రీనివాసరెడ్డి కన్నుమూత

సినీ ప్రముఖుడు శ్రీనివాసరెడ్డి కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి(56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సీనియర్ దర్శకుడు సాగర్ కు శ్రీనివాసరెడ్డి సోదరుడు.

సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తూనే మౌళి, సుధాకర్‌బాబు, సాగర్‌లతో కలసి సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా 'జగదేకవీరుడు', 'అమ్మదొంగా' వంటి చిత్రాలు నిర్మించారు. నిర్మాత చంటి అడ్డాలతో కలిసి 'పవిత్రప్రేమ', 'ఆరోప్రాణం', 'బాచి' తదితర చిత్రాలను నిర్మించారు.

Cinematographer Srinivas Reddy passed away

ఇక ఇటీవల రష్మి గౌతమ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'చారుశీల' సినిమాకు శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించారుదర్శకత్వం వహించారు శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు బుధారం నిర్వహించనున్నారు.

టెక్నీషియన్‌గా, దర్శక నిర్మాతగా తనదైన పరిశ్రమకు సేవలు అందించిన శ్రీనివాస్‌రెడ్డి మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేసారు. శ్రీనివాసరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

English summary
Senior Cameraman, director and producer Srinivas Reddy Uyyur (56) is no more. He co-produced many movies like Jagadeka Veerudu, Amma Donga, Bachi, Aaro Pranam, etc.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu