»   » సీరియర్ కెమెరామన్ విన్సెంట్ కన్నుమూత

సీరియర్ కెమెరామన్ విన్సెంట్ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీయర్ కెమెరామెన్, దర్శకుడు ఆలోసియస్ విన్సెంట్(86) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది స్వాస విడిచారు. జూన్ 14, 1928న జన్మించిన విన్సెంట్ కెరీర్లో ఎన్నె సూపర్ హిట్ చిత్రాలకు పని చేసారు.

లెజెండ్ ఎన్టీఆర్ నటించిన ‘మేజర్ చంద్రకాంత్' సినిమాతో పాటు అన్నమయ్య, ఆపద్భాంధవుడు, లేతమనసులు, అడవిరాముడు, బొబ్బిలి సింహం, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లుడుగారు, సాహస వీరుడు సాగర కన్య లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పలు కమర్షియల్ సినిమాలకు పని చేసారు. తమిళం, మళయాలంలో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Cinematographer A Vincent dies

ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్లుగా పేరు గాంచిన జయనన్ విన్సెంట్, అజయన్ విన్సెంట్....ఆలసియస్ విన్సెంట్ కుమారులే.

English summary
Veteran Cinematographer & Director Aloysius Vincent breathed his last on Wednesday at a private hospital in Chennai. He was undergoing treatment for Pneumonia since some time and passed away at the age of 86.
Please Wait while comments are loading...