హైదరాబాద్‌లో తొలి ఇంటర్నేషనల్ మల్టీప్లెక్స్(ఫోటోలు)
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి సినీ వీక్షణానుభూతిని కలిగిస్తూ అత్యుత్తమమైన 3డి టెక్నాలజీతో రియల్ 3డి మరియు వీఐపీ రిక్లైనర్స్ సాయంతో ఆస్వాదించే అవకాశం ఇపుడు హైదరాబాద్‌లో దక్కుతుంది. కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌లో కొత్తగా ప్రారంభమైన సినీపొలిస్ అనే మల్టీ ప్లెక్స్ల్‌లో ఈ అనుభూతిని పొందవచ్చు.
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద, భారతదేశపు తొలి అంతర్జాతీయ ప్రదర్శనదారు సినీపొలిస్. తన 5వ స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లోని మంజీరా మాల్‌లో ప్రారంభించింది. పూర్తిగా డిజిటల్, రియల్ 3డితో కూడిన ఈ మల్టీప్లెక్స్‌లో రోజుకు 25 షోలు నడుస్తాయి. 1400కు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. సినీ పొలిస్ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో ఇది తొలి మల్టీప్లెక్స్.
రియల్-డి సిస్టమ్స్ వారి అత్యాధునిక 3డి టెక్నాలజీ ప్రస్తుతం మేం ప్రవేశ పెడుతున్నపలు కొత్త సాంకేతికల్లో ఒకటి. రియల్-డి ప్రపంచంలో అత్యంత విస్తృతంగా వినియోగిస్తున్న 3డి టెక్నాలజీ. వీక్షకులకు అద్భుతమైన 3డి సినీ వీక్షణ అందిస్తుంది. దీంతో పాటు అత్యాధునిక డాల్బీ 7 సరౌండ్ సిస్టమ్. అతిపెద్ద లెగ్ రూమ్‌తో కూడి ఆడియో టెక్నాలజీ ఈ థియేటర్ సొంతమని నిర్మాహకులు తెలిపారు.

సినీపొలిస్ కంట్రీ హెడ్
సినీ పొలిస్ ఇండియా కంట్రీ హెడ్ ఆశిష్ శుక్లా మాట్లాడుతూ...సినీపొలిస్ భారతదేశ ప్రేక్షకుల అవసరాలు తీర్చేందుకు కట్టుబడి ఉంది. దేశ వ్యాప్తంగా వారికి అంతర్జాతీయ సినీ అనుభూతిని అందజేయడానికి సిద్ధమైంది అని తెలిపారు.

హైదరాబాద్‌లో ఫస్ట్
హైదరాబాద్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టిన తొలి అంతర్జాతీయ మల్టీప్లెక్స్ చెయిన్ కూడా మేమే. మా అత్యాధునిక సినీ సౌకర్యాల సాయంతో సిసలైన ప్రపంచ స్థాయి సినీ వీక్షణానుభూతిని మా ప్రేక్షకులు సొంతం చేసుకుంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాం అన్నారు.

వీఐపీ రిక్లైనర్ సీట్లు
సినీ పొలిస్ వీఐపీ పేరిట మేం ప్రవేశ పెట్టిన లగ్జోరియస్ రిక్లైనర్ సీట్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా అత్యంత ఆదరణ పొందాయి. హైదరాబాద్‌లోని మా అన్ని ఆడిటోరియాల్లోనూ ఈ రిక్లైనర్ సీట్లనే ప్రవేశ పెట్టామని తెలిపారు.

చవులూరించే తినుబండారాలు
సిసలైన అంతర్జాతీయ స్థాయి సినీ వీక్షణతో పాటు కాఫీ ట్రీలో అందించే చవులూరించే తినుబండారాలను కూడా మా ప్రేక్షకులు ఆస్వాదించ వచ్చు అన్నారు.

సభ్యత్వంతో లాభం
సినీ పొలిస్ క్లబ్ సభ్యత్వంతో కూడా బాగా లబ్ది పొందవచ్చు. అందులో భాగంగా సినీ ప్రేక్షకులు ఉచితంగా తమ పేరు రిజిస్టర్ చేయించుకోవచ్చు అన్నారు.

రివార్డు పాయింట్లు
సినీపొలిస్ బాక్సాఫీసులో చేసే ప్రతి టికెట్ కొనుగోలుపై రివార్డు పాయింట్లు వారి కార్డుకు జమవుతాయి. ఈ పాయింట్లను ఉచిత టిక్కెట్ల కోసం రీడిమ్ చేసుకోవచ్చు.

స్టార్స్‌ను కలిసే అవకాశం
అభిమాన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తారలను కలసుకునే లైఫ్ టైం అవకాశం కూడా క్లబ్ సినీపొలిస్ సభ్యులకు లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

టిక్కెట్ల కోసం..
సినిపొలిస్ టిక్కెట్ల కోసం సినిపొలిస్ వెబ్ సైట్ సంప్రదించి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.


Click it and Unblock the Notifications