Malli Pelli: నరేష్, పవిత్రల 'మళ్లీ పెళ్లి'కి గ్రీన్ సిగ్నల్... రమ్య రఘుపతికి కోర్టు ఊహించని షాక్
నటుడు డాక్టర్ వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల తన పవిత్రతో పెళ్లి అంటూ మీడియాలో చర్చనీయంశం అయ్యారు. అంతే కాదు.. మళ్లీ పెళ్లి అంటూ ఓ సినిమాను కూడా తీసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాపై దాఖలైన కేసును సిటీ సివిల్ కోర్టు కొట్టేవేసింది. అంతే కాదు నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతి రాకుండా నిషేధం విధించింది కోర్టు. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రముఖ నటుడు, డాక్టర్ వీకే నరేష్ ఇటీవల కాలంలో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన ఇంటింటి రామాయణం, రంగబలి, సాజవరగమన చిత్రాల్లో ఆయన కామెడీ.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అంతే కాదు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నడు.

ఇదిలా ఉంటే.. ఆయన పెళ్లి వ్యవహారంపై అప్పట్లో చర్చనీయంశం అయిన సంగతి తెలిసిందే. ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చి.. పవిత్ర లోకేష్ తో సహాజీవనం చేయడం సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల పవిత్ర లోకేష్ నరేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాను తీశారు. ఇక ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో సందడి చేసింది.

ఊహించని షాక్... :ఇటీవల ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ఇక ఆ విడుదలను నిలిపివేయాలని కోరుతూ... బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు రమ్య రఘుపతి. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేసింది. దీంతో రమ్య రఘుపతికి ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు.
మళ్లీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. :బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు తీర్పును వెల్లడించింది. తెలుగు, కన్నడ భాషలలో సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా... ఈ తీర్పు ప్రకారం అన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా ఈ సినిమాని నిర్మాతలు స్వేఛ్చగా ప్రసారం చేయవచ్చని తెలిపింది.

ఇంట్లోకి రాకుండా నిషేధం... :మరో కేసులో నరేష్, కుటుంబ సభ్యులు, రమ్య రఘుపతిని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. రమ్య రఘుపతి, నరేష్ పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిపై గృహ నిషేదం కేసు పెట్టడం జరిగింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.

రమ్య రఘుపతిపై కేసులు...:నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలు కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసినట్లైంది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్య భర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది. రమ్య రఘుపతిపై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్ కు సంబంధించి సైబర్ కోర్టు, సైబర్ సెల్‌లో సైబర్ క్రైమ్ కేసు పెండింగ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











