'ఓం వాత్సాయనా'...ఇదేం పని నాయనా

దీన్ని విన్న వారు ఆ రెండు పదాలను కలపటంతో మండిపడుతున్నారు.అసలు మనవాళ్లకు ఇదేం పిచ్చో అర్థం కావటం లేదు. 'ఓం' అన్న పదం పవిత్రమన పదానికి వాత్సాయన అంటూ ముడిపెడ్తారు. అసలు ఓం అనే పదాన్ని ముందు మంటగలిపింది కన్నడ హీరో ఉపేంద్ర. ఆ చిత్రం హిట్ కావటంతో సినీ జనాలకు ఆ పేరుపై క్రేజ్ ఎక్కువైనట్టుంది. పైగా హైదరాబాద్‌లో కరుణామయుడు స్టూడియో లో ఈ పాటను చిత్రీకరించటం జరిగింది. కరుణామయుడు అర్ధం ఏమిటి? ఇలాంటి దృశ్యాలా అక్కడా చిత్రీకరించేదని జనం గొణుక్కుంటున్నారు.కాకపోతే పేరులో ఉన్నతంగా ఉన్నంత మాత్రాన అక్కడ బిజెనెస్ చేయకూడదంటే ఎలాగన్నది ఓ పాయింటు.
ఇక పేరుతో మరో విచిత్రం ఏమంటే ఈ వేడి వాడి దృశ్యాలు 'పూజా భారతి' పై తీశారు. పేరులో ఏముందంటారా? అలా అయితే మీ ఇష్టం. అంతేగాక తాను చేస్తున్న ఈ పాట చాలా బాగుంటుందని, ఇక ముందు ఐటమ్ సాంగ్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తాను (విజృంభిస్తాను) అని చెబుతోంది ఈవిడ. చాలా బాగుంది కదా...అయినా ఆమె కూడా బ్రతకాలి అంటారా అయితే మీ ఇష్టం.


Click it and Unblock the Notifications











