»   »  ఎన్టీఆర్ కు గాయమైందని రచ్చ చేశారు..క్లారిటీ వచ్చింది!

ఎన్టీఆర్ కు గాయమైందని రచ్చ చేశారు..క్లారిటీ వచ్చింది!

Subscribe to Filmibeat Telugu

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ గాయపడ్డాడు అంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వాటిపై క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ కలసి ఇటీవల లాస్ ఏంజెల్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టి స్టారర్ చిత్రం కోసం ట్రైనింగ్ కొరకు వీరిద్దరూ అమెరికా వెళ్లారు. ఆ అక్కడ టెస్ట్ షూట్ లో భాగంగా ఎన్టీఆర్ గాయపడ్డాడు అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్త సారాంశం.

Clarification on NTR injury rumors

తాజగా ఈ రూమర్ పై క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ గాయపడ్డాడంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. అవి కేవలం గాలివార్తలు మాత్రమే. ఎన్టీఆర్ సన్నిహితులు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ త్వరలోనే హైదరాబాద్ తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు కళ్యాణ్ రామ్ చిత్రం ఎమ్మెల్యే చిత్ర ఆడియో వేడుకలో పాల్గొనడానికి ఎన్టీఆర్ హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.

English summary
Clarification on NTR injury rumors. NTR is fine
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu