For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nitya Menon Pregnant: నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీపై క్లారిటీ.. మరో హీరోయిన్ పోస్టుతో మేటర్ లీక్

  |

  సాధారణంగా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఇట్టే హాట్ టాపిక్ అయిపోతుంటుంది. అలాంటిది వాళ్ల ఎఫైర్లు లాంటి వార్తలు ఏ రేంజ్‌లో సంచలనం అవుతుంటాయో తెలిసిందే. ఇలానే ఇప్పుడు సౌతిండియన్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా సెన్సేషన్ అవుతోంది. దీంతో దీనిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో మలయాళ హీరోయిన్ పోస్టుతో ఇది మలుపు తిరిగింది. అదే సమయంలో నిత్య మీనన్ ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ వచ్చేసింది. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

  ప్రెగ్నెంట్ అంటూ నిత్యా పోస్ట్

  ప్రెగ్నెంట్ అంటూ నిత్యా పోస్ట్

  ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోని అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నిత్యా మీనన్ సోషల్ మీడియాలోనూ చేసిన పోస్ట్ హైలైట్ అవుతోంది. ఇందులో ఆమె.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిన కిట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు, 'అద్భుతం మొదలైంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

  డెలివరీ తర్వాత షాకింగ్‌గా సోనమ్: ఎద అందాలు చూపిస్తూ దారుణంగా!

  నేషనల్ రేంజ్... శుభాకాంక్షలు

  నేషనల్ రేంజ్... శుభాకాంక్షలు


  సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రెగ్నెంట్ అయినట్లు అర్థం వచ్చేలా చేసిన పోస్టు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సామాన్యులే కాదు.. కొందరు ఫిల్మ్ సెలెబ్రిటీలు సైతం నిత్యాకు సపోర్టుగా విష్ చేస్తూ కామెంట్లను పెడుతున్నారు. దీంతో ఈ న్యూస్ మరింత హాట్ టాపిక్ అయింది.

  పెళ్లి జరిగిందా? తల్లి ఎప్పుడు?

  పెళ్లి జరిగిందా? తల్లి ఎప్పుడు?

  ప్రెగ్నెంట్ అయినట్లు నిర్ధారిస్తోన్న కిట్‌ ఫొటోను షేర్ చేసిన నిత్యా మీనన్ అందరికీ షాకిచ్చింది. దీంతో ఆమె గర్భవతి అయిందంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు, చాలా మంది నెటిజన్లు నీ పెళ్లి ఎప్పుడు అయింది? నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే, చాలా మంది దారుణమైన పదజాలంతో నిత్యాను ట్రోల్స్ చేస్తున్నారు.

  తెలుగు హీరోయిన్‌తో సిద్దార్థ్ డేటింగ్: హాట్ టాపిక్‌గా ఇన్‌స్టా పోస్ట్.. హీరో ఒప్పుకున్నట్లేగా!

  మలయాళ హీరోయిన్ కూడా

  మలయాళ హీరోయిన్ కూడా


  దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ న్యూస్ హైలైట్ అవుతుండగానే.. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పార్వతి అనే హీరోయిన్ కూడా అచ్చం అలాంటి పోస్టునే చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకే సమయానికి నిత్యా మీనన్ షేర్ చేసిన ఫొటోను, చేసిన క్యాప్షన్‌నే పెట్టింది. దీంతో పార్వతి పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  ప్రెగ్నెన్సీ న్యూస్‌పై స్పష్టత

  ప్రెగ్నెన్సీ న్యూస్‌పై స్పష్టత

  ఒకవైపు నిత్యా మీనన్.. మరోవైపు పార్వతి ప్రెగ్నెన్సీకి సంబంధించిన పోస్టులు చేయడంతో ఇది కచ్చితంగా సినిమా ప్రమోషన్‌లో భాగమేనన్న టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరూ కలిసి 'వండర్ ఉమెన్' అనే సినిమాలో నటిస్తున్నారట. ఈ మూవీని అందరి దృష్టిలో పడేలా చేయడం కోసమే ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెన్సీ పోస్టులు చేశారనే టాక్ వినిపిస్తోంది.

  యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం: అది లేకుండానే షోలోకి.. స్టేజ్‌పైనే పరువు తీసిన హీరోయిన్

  సింగిల్ మదర్ కష్టాలు చెప్తూ

  సింగిల్ మదర్ కష్టాలు చెప్తూ


  నిత్యా మీనన్, పార్వతి ప్రధాన పాత్రల్లో రాబోతున్న 'వండర్ ఉమెన్' మూవీ.. ఎమోషనల్ కాన్సెప్టుతో రాబోతుందని తెలుస్తోంది. సింగిల్ మదర్స్ సమాజంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే నేపథ్యంతో ఇది తెరకెక్కుతోందని సమాచారం. ఇదిలా ఉండగా.. హీరోయిన్ల ప్రెగ్నెన్సీ వార్తలతో ఈ సినిమా మొదట్లోనే దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిందని చెప్పొచ్చు.

  English summary
  South Indian Actress Nithya Menen Pregnancy Gone Hot Topic in Film Circles. Now Clarity on This News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X