For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhanush Aishwarya: ధనుష్-ఐశ్వర్య మళ్లీ కలవనున్నారా?.. అసలు కారణం ఇదే! కొత్త ట్విస్ట్

  |

  కోలీవుడ్ బ్యూటిఫుల్ జంటగా పేరు తెచ్చుకున్నారు ధనుష్ అండ్ ఐశ్వర్య రజనీకాంత్. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఆ మధ్య షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల వారిద్దరూ మళ్లీ కలవనున్నారని, విడాకులను రద్దు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ధనుష్, ఐశ్వర్య రజనీ కాంత్ మళ్లీ ఒక్కటి కానున్నారని, ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద తీపి కబురు అని అందరూ అనుకున్నారు.

  అయితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పుకార్లు ఎక్కువయ్యాయి. అందులో ఏది నిజం.. ఏది అబద్ధం అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే ధనుష-ఐశ్వర్యలు పెద్దల సమక్షంలో మాట్లాడింది నిజమేనట. కానీ కలవనున్నారనే విషయంపై మరో వార్త చక్కర్లు కొడుతోంది.

  మహిళా దర్శకులిరాలిగా పాపులారిటీ..

  మహిళా దర్శకులిరాలిగా పాపులారిటీ..

  ధనుష్.. కోలీవుడ్​లో స్టార్​ హీరోలలో ఒకరు. ఐశ్వర్య రజనీకాంత్​.. సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ కుమార్తెగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో మహిళా దర్శకులిరాలిగా పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ధనుష్​-ఐశ్వర్య జంట చూడముచ్చటగా ఉండేది.

  విడిపోవాలని నిర్ణయించుకున్నాం..

  విడిపోవాలని నిర్ణయించుకున్నాం..

  18 ఏళ్లపాటు వివాహ బంధంతో కలిసి ఉన్న ధనుష్​-ఐశ్వర్య అనూహ్యంగా జనవరి 18, 2022న విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులే కాకుండా, సినీ ప్రేక్షకులు షాక్​కు గురయ్యేలా చేశారు. 'భార్యాభర్తలుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని పోస్ట్​ పెట్టి ఆశ్చర్యపరిచారు.

  ఎప్పటికైనా కలవకపోతారా?

  ఎప్పటికైనా కలవకపోతారా?

  ఈ వార్తతో సూపర్​ స్టార్​ రజనీ కాంత్, ధనుష్​ ఫ్యాన్స్​ తీవ్రంగా బాధపడ్డారు. అయితే ధనుష్​ తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్​ మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా? అని ఎంతో ఎదురుచూశారు. కానీ, అలా జరగలేదు. ఇంకా తన సోషల్​ మీడియా అకౌంట్​లలో తన పేరు చివరన ఉన్న ధనుష్​ పేరు తొలగించి రజనీకాంత్​ పేరును చేర్చి ఐశ్వర్య ఇంకా షాక్​ ఇచ్చింది.

  మళ్లీ కలవనున్నారు అనే వార్తలు..

  మళ్లీ కలవనున్నారు అనే వార్తలు..

  ఇదంతా ఒక ఎత్తు. ఇక ఇటీవల వాళ్లిద్దరూ మళ్లీ కలవనున్నారు అనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. విడాకులతో విడిపోయిన వాళ్లిద్దరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని, అలాగే వారి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించుకుని మళ్లీ ఒక్కటి కానున్నారనే న్యూస్ హల్ చల్ చేసింది. అంతేకాకుండా ధనుష్-ఐశ్వర్య అసలు అధికారికంగా విడాకులకు అప్లై చేయలేదని, ఇప్పుడు కలిసి ఉండటం చాలా సులభం అని కూడా వినిపించింది.

  ఓ మీడియా సంస్థ క్లారిటీ..

  ఓ మీడియా సంస్థ క్లారిటీ..

  దీంతో ఈ విషయమై ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ లను ఓ మీడియా సంస్థ క్లారిటీ కోసం సంప్రదించిదట. దీనికి వారు మేనేజర్లు సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ మళ్లీ కలుస్తారని, విడాకులు రద్దు చేసుకుంటారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలాంటి పుకార్లను నమ్మొద్దని వారు కారినట్లు సమాచారం.

  సమావేశమైన మాట నిజమే, కానీ..

  సమావేశమైన మాట నిజమే, కానీ..

  అయితే ఐశ్వర్య-ధనుష్ ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సమావేశమైన మాట నిజమేనట. రజనీకాంత్ సమక్షంలో ఇరు కుటుంబాలు హాజరయ్యారట కూడా. కానీ ఐశ్వర్య-ధనుష్ ఇద్దరు కలిసింది వారి పిల్లల భవిష్యత్తు గురించని ప్రస్తుతం వచ్చిన సమాచారం. వారి పిల్లలకు ఏం చేద్దామనే ఆలోచనలో భాగంగానే ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు తప్ప.. తాము కలిసిపోయేందుకు వారు మాట్లాడుకోలేదని మేనేజర్లు చెప్పారట.

  ఇదే కొత్త ట్విస్ట్..

  ఇదే కొత్త ట్విస్ట్..

  దీంతో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు కలవనున్నారు కానీ, అది వారి పిల్లల భవిష్యత్తు కోసమేనని విడాకులు రద్దు చేసుకుంటున్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరుకు ధనుష్-ఐశ్వర్య కలుస్తున్నారు, విడాకులు రద్దు చేసుకుంటున్నారని సంతోషమైన ట్విస్ట్ ఇస్తే.. కేవలం పిల్లల భవిష్యత్తు కోసం రద్దు చేసుకుంటున్నారని చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చినట్లు అయింది. కాగా ధనుష్-ఐశ్వర్యలకు యాత్రా, లింగా అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

  English summary
  A Media Gives Clarity On Kollywood Star Hero Dhanush And Aishwarya Rajinikanth Decided To Call Of Divorce At Rajinikanth Home News Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X