అజిత్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్: ఇప్పుడు దానిపై పడ్డారు.. ముదురుతోన్న వివాదం!

మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అనే గొడవలు ఇప్పటివి కాదు. ఇండస్ట్రీలో హీరోలంతా కలుపుగోలుగా ఉన్నా.. వాళ్ల పేరు చెప్పుకుని ఫ్యాన్స్ మాత్రం రచ్చ చేస్తూనే ఉంటారు. ఇలాంటి గొడవలు కొన్నిసార్లు తీవ్ర ఘర్షణకు దారితీసి ప్రాణాలకు మీదకు తెచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్వయంగా హీరోలు కల్పించుకుని మరీ ఇలాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేసినా!.. అబ్బే.. ఫ్యాన్స్ మాత్రం మాట వింటే కదా!..

 అజిత్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్:

అజిత్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్:

తమిళంలో రజనీకాంత్‌ను మినహాయిస్తే.. ఆయన తర్వాత అజిత్, విజయ్‌లకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరిలో ఎవరి సినిమా విడుదలైనా ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఎవరి హీరోను వాళ్లు పొగుడుకోవడంలో తప్పు లేదు కానీ.. వేరే హీరోలు తమ హీరో కాలి గోటికి కూడా పనికిరాడన్నట్లుగా మాట్లాడితేనే తంటా. ఇక్కడినుంచే వివాదాలన్నీ మొదలవుతాయి.

 టీఆర్పీ వివాదం:

టీఆర్పీ వివాదం:

అజిత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య ప్రతీసారి ఏదో ఒక వివాదం పుట్టుకొస్తూనే ఉంది. నిన్న మొన్నటిదాకా కలెక్షన్లు, యూట్యూబ్ లైక్స్, వ్యూస్ విషయంలో గొడవపడ్డ ఇరువురు.. ఇప్పుడు బుల్లితెర మీద పడ్డారు. టీవిలో తమ హీరో సినిమాకే ఎక్కువ టీఆర్పీ వచ్చిందంటే.. కాదు.. మా హీరోకే ఎక్కువని పేచీలు పెట్టుకుంటున్నారు.

Recommended Video

అజిత్ కి రహస్యంగా సర్జరీ Actor Ajith Underwent A Secret Surgery
 టీఆర్పీలో అజిత్ 'వీరం' టాప్..:

టీఆర్పీలో అజిత్ 'వీరం' టాప్..:

అజిత్ హీరోగా చేసిన వీరం సినిమా తొలిసారి టెలివిజన్‌లో ప్రసారమైనప్పుడు 18.1టీఆర్పీ దక్కించుకుని టాప్‌లో నిలిచింది. అంతకుముందు మరే సినిమా ఆ స్థాయి టీఆర్పీ తెచ్చుకోలేదు. ఇటీవలే ఈ సినిమాను మరోసారి టీవిలో టెలికాస్ట్ చేయగా.. రెండోసారి 9 టీఆర్పీ తెచ్చుకుంది.

 విజయ్ మెర్సల్ 8.5:

విజయ్ మెర్సల్ 8.5:

అజిత్ వీరం రెండో సారి టీవిలో టెలికాస్ట్ అయినప్పుడు.. అదే సమయంలో వేరే చానెల్ లో విజయ్ టీవిలో అవార్డ్స్ ఫంక్షన్ ప్రసారమైంది. ఆ కార్యక్రమానికి 10 టీఆర్పీ వచ్చింది. ఇక ఇటీవలే విడుదలైన విజయ్ మెర్సల్ చిత్రం టీవిలో తొలిసారి టెలికాస్ట్ అయినప్పుడు 8.5టీఆర్పీ తెచ్చుకుంది.

అజితే గ్రేట్ అని..

అజితే గ్రేట్ అని..

అజిత్ వీరం సినిమా రెండోసారి టీవిలో ప్రసారమైనప్పుడు 9 రేటింగ్ తెచ్చుకుంటే.. విజయ్ హిట్ సినిమా మెర్సల్ మొదటిసారి టీవిలో టెలికాస్ట్ అయినప్పుడు కూడా 8.5కే పరిమితమైంది. ఈ లెక్కన విజయ్ కంటే తమ హీరో అజితే గ్రేట్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

 ముదురుతున్న వివాదం..:

ముదురుతున్న వివాదం..:

అజిత్ ఫ్యాన్స్ టీఆర్పీల విషయాన్ని లేవనెత్తడంతో.. విజయ్ ఫ్యాన్స్ ఫ్లాప్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అజిత్ ఫ్లాప్ సినిమాల రేటింగ్స్ టీవిలో ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం బాగానే ముదురుతోంది.

 అజిత్ చెప్పినా..:

అజిత్ చెప్పినా..:

నిజానికి అజిత్ ఏ ఫ్యాన్స్ గ్రూపును అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు. సాధారణంగా అజిత్ కు ఇలాంటివి నచ్చవు కూడా. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆయన పేరు చెప్పి ఇలా వేరే హీరోలతో రచ్చ దిగుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే, అజిత్ తమిళంలో చేసిన వీరం సినిమానే పవన్ కల్యాణ్ కాటమరాయుడు పేరుతో తెలుగులో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X