నిర్మాత దెబ్బకొట్టబట్టే వర్మతో దూరం:జెడీ చక్రవర్తి
రామ్ గోపాల్ వర్మ తో ఎప్పుడూ చనువుగా ఉండే జెడీ చక్రవర్తి గత రెండేళ్ళుగా ఆయన ప్రక్కన కనపడటం లేదు.రీసెంట్ గా మనీ మనీ మోర్ చిత్రంతో తెరమీదకు మరో సారి దర్సకుడుగా వచ్చిన జెడీ ఈ విషయమై మీడియాకు క్లారిటీ ఇస్తూ మాట్లాడారు.జెడీ మాటల్లోనే..ఇప్పటికీ వర్మ నేనూ ప్రెడ్స్ మే.అయితే నాకు వచ్చిన సమస్య అల్లా నా సిద్దం,హోమం నిర్మాత కిరణ్ కుమార్ తోనే.అతను నిర్మాతగా నా దర్శకత్వంలో ఆ సినిమాలు చేసాను.అలాగే ఆ చిత్రాలని చాలా టైట్ బడ్జెట్ తో తీసాను.ఆ సినిమాలతో నిర్మాత బాగా లాభాలు సంపాదించారు.నాకు రెమ్యునేషన్ కూడా ఇవ్వలేదు.అలాగే నాకు ఆ ప్రాజెక్టులలో షేర్ ఇస్తానన్నారు.అదీ లేదు.
నిజానికి హోమం చిత్రం నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలలో చేసాను.దాన్ని దిల్ రాజుకి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలకు అమ్మారు.అలాగే శాటిలైట్ రైట్స్ కూడా కోటి ముప్పై లక్షలతో మంచి లాభానికే అమ్మారు.నా తర్వాత సినిమా సిద్దం కేవలం కోటి తొమ్మిది లక్షలతో పందొమ్మిది రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసి అప్పచెప్పాను. ఆ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా కోటి ఎనభై ఏడులక్షలు వచ్చాయి.ఇక ఎంతకు అమ్మారనేది మీకు తెలుసు.అలా రెండు చిత్రాలు కు మంచి లాభాలే వచ్చాయి.అయితే ఆ తర్వా త మామధ్య విభేదాలు వచ్చాయి.ఆయన రామ్ గోపాల్ వర్మ తో సినిమాలు చేయటం మొదలెట్టారు.దాంతో నేను ఆ చిత్రం సెట్స్ కు కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు.అందుకే దూరంగా ఉండిపోయాను అన్నారు.


Click it and Unblock the Notifications











