ఈ సారి మెగా మూవీస్ కి క్లాస్ తప్పదా...!?

By Sindhu

ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది హీరోలు ఫీల్డులో ఉంటే ఒకసారి కాకపోతే మరోసారి అయినా పోటీ తప్పదు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా కానీ మెగా హీరోల సినిమాల మధ్య చాలా కాలంగా పోటీ ఏర్పడుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలతో ప్రతిసారి అల్లు అర్జున్ చిత్రాలు రావడం రివాజుగా మారింది. అయితే ఈసారి పవన్ కి అల్లు అర్జున్ తో కాకుండా రామ్ చరణ్ తో పడుతోంది.

డిసెంబర్‌లో తమిళ డైరెక్టర్ విష్ణవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న పవన్‌కల్యాణ్ "పంజా" .. జనవరిలో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న రామ్‌ చరణ్ "రచ్చ" విడుదలవుతుందని అంటున్నారు. పవన్‌ కల్యాణ్ "పంజా" హిట్ అయితే రామ్‌ చరణ్ "రచ్చ" వచ్చి కలక్షన్స్ ఎక్కడ లాగేసుకుంటుందో అని ఒక పక్క భయం వేస్తుంది. మెగా హిరోలకు అసలు ప్లానింగ్ లేకుండా, ఒకే టైములో తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంవత్సరానికి ఒక్కొక హీరోకు వచ్చేవి ఒకటో రెండో, దాంట్లోను మరో మెగా హీరో సినిమాతో పోటీనా అని అభిమానులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మెగా క్లాష్ పక్కన పెడితే ఎప్పుడూ లేని విధంగా పవన్‌ కల్యాణ్ సినిమా నిర్మాతలు పబ్లిసిటీ చేస్తున్న విధానం అభిమానులను బాగా ఆకట్టుకొని మంచి ఉత్సాహాన్ని నింపుతుంది. మూవీ స్టిల్స్ అభిమానులకు ఈ సినిమాపై అంచనాలను బాగా పెంచగా, ఆడియో రిలీజ్ అయ్యాక నార్మల్ పేక్షకులలో అదే అంచనాలను క్రియేట్ చేస్తుందనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X