ఎన్టీఆర్ కొత్త తలనొప్పి
ఓ సినిమా నిర్మాణ వ్యవహారంలో ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన కొడాలి నాని,వల్లభనేని వంశి మేహన్ మధ్య విభేధాలు తలెత్తినట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా షాక్ డైరక్టర్ హరీష్ శంకర్ తో నల్లమలుపు బుజ్జి నిర్మించతలపెట్టిన ఎమ్మల్యే చిత్రం నిర్మాణం విషయంలో ఈ విభేధాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వి.వి.వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తయారవుతున్న అదుర్స్ చిత్రానికి నల్లమలపు బుజ్జి నిర్మాణ భాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దానిని కొడాలి నాని,వంశీ మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బుజ్జీ నిర్మించే చిత్రంలో నటించాలని ఎన్టీఆర్ ని వంశీ మోహన్ అడిగారు. అయితే ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వలేదు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించే చిత్రంలో నటించేందుకు ఆయన అంగీకారం తెలిపారు.
ఆ చిత్రం మెహర్ రమేష్ డైరక్షన్ లో రానుంది. ఇక అశ్వనీదత్ తెలుగు దేశం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో క్రియాశీలంగా పనిచేస్తూండటంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఈయనకు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు. దాంతో బుజ్జీ నిర్మించే చిత్రంలో ఎన్టీఆర్ నటించాలంటే మరో ఏడాది పడుతుంది. ఈ సంఘటనతో దీని వెనక ఎవరి ప్రోద్బలమో ఉందని భావించిన వంశీమోహన్ తీవ్రంగా నొచ్చుకున్నట్లు తెలిసింది. అందువల్లే ఎన్టీఆర్ హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో తన భాగస్వామిగా ఉన్న ఎమ్మల్యే నానిని తప్పించినట్లు తెలుస్తోంది. అలాగే కొడాలి నాని ఖర్చు చేసిన మొత్తాన్ని వంశి తిరిగి చెల్లించారు. తనకు సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరు మధ్య విభేధాలతో ఎన్టీఆర్ చాలా భాధపడి,సలహా కోసం చంద్రబాబు ని కలిసి చర్చించినట్లు చెప్తున్నారు. అలాగే ఆదివారం ఎన్టీఆర్ నిమ్మకూరు పర్యటనలోనూ కొడాలి నాని, వంశి మోహన్ ఇద్దరూ మాట్లాడకోకుండా ఉన్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











