వినాయక్‌తో సాయిధరమ్ తేజ్ గొడవ?: ఇలాంటి కథా!, అదే యావరేజ్ అనుకుంటే!
సినీ పరిశ్రమలో నిప్పు లేకుండానే పొగ రావడం సహజం. ఏ ఆధారం లేకపోయినా.. ఎక్కడినుంచో పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. అవి మంచైతే.. ఆ నటులూ ఆనందిస్తారు. డ్యామేజ్ చేసేవైతే మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తారు. అన్నీసార్లు క్లారిటీ ఇవ్వడం కూడా సాధ్యపడకపోవచ్చు. సో.. ఆ రూమర్స్ అలా షికారు చేస్తూనే ఉంటాయి.
తాజాగా సాయిమ్ ధరమ్ తేజ్ కొత్త సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా కథ విషయంలో దర్శకుడు వినాయక్‌తో హీరో సాయి ధరమ్ గొడవపడ్డాడనేది దాని సారాంశం. ఇంతకీ అసలు విషయమేంటో.. ఓ లుక్కేద్దాం..

నాయక్ సీక్వెల్:
దర్శకుడు వి.వి.వినాయక్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కిన నాయక్ సినిమాకు సీక్వెల్‌గా ఈ కథ ఉండబోతుందన్న ఊహాగానాలు తెర పైకి వచ్చాయి.

గొడవ జరిగిందా?:
కేవలం సీక్వెల్ అన్న ఊహాగానాలు మాత్రమే కాదు, ఈ కథ విషయమై హీరో సాయిధరమ్ వినాయక్‌తో గొడవ కూడా పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఆ చిత్ర యూనిట్ లోని ఓ సభ్యుడు తెలిపినట్లు సమాచారం.

యావరేజ్ సినిమాకు సీక్వెలా?:
నిజానికి నాయక్ సినిమా ఓ యావరేజ్. కథ పరంగా అయితే బిలో యావరేజ్ అనే చెప్పాలి. అలాంటి యావరేజ్ సినిమాకు ఏ దర్శకుడు సీక్వెల్ ప్లాన్ చేయాలని ఆలోచించడు. కాబట్టి వినాయక్ ఆ సినిమా సీక్వెల్ చేయాలనుకుంటున్నారన్న ప్రచారంలో నిజం లేదనే చెప్పాలి.

నిఖిల్ తోనూ విభేదాలు:
సాయి ధరమ్-వినాయక్ సినిమాకు సంబంధించి గతంలోనూ ఓ రూమర్ పుట్టుకొచ్చింది. ఈ సినిమా కథ తమిళ హిట్ 'కనితన్'కు దగ్గరగా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. అప్పటికే కనితన్ తెలుగు రీమేక్ కు నిఖిల్ కమిట్ అయ్యారు. దీంతో సాయిధరమ్, నిఖిల్ మధ్య విభేదాలు వచ్చాయన్న పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి.

ఎలా ఉండబోతుంది?:
చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయిధరమ్-వినాయక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో విభిన్న కథ, కథనాలు ఉంటాయని తెలుస్తోంది. సాయిధరమ్ కెరీర్ లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ అనిపించుకోదగ్గ హిట్టు లేకపోవడంతో.. ఆ లోటును పూడ్చేలా వినాయక్ ఔట్&ఔట్ కమర్షియల్ సినిమా తెరకెక్కిస్తారని టాక్.


Click it and Unblock the Notifications











