క్లియర్ : రామ్ చరణ్ ఫేస్ వ్యాల్యూ రూ. కోటి!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం ఈ నెల 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుస్థాన్ యుని లీవర్ సంస్థ తమ ఉత్పత్తుల్లో ఒకటైన 'క్లియర్' అనే యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రమోషన్ నిమిత్తం 'ఎవడు' చిత్రంతో డీల్ కుదుర్చుకుంది.
వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్, రేడియో లాంటి ప్రసార మాద్యమాల్లో కనిపించే 'ఎవడు' మూవీ ట్రైలర్లు, పోస్టర్లు, ప్రకటనల్లో 'క్లియర్' షాంపూ కనిపించ నుంది. ఎవడు-క్లియర్ జాయింట్ ప్రచారం నిమిత్తం హిందుస్తాన్ యుని లీవర్ సంస్థ రూ. కోటి ఖర్చు చేయనుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రకనట జారీ చేసారు. సో....రామ్ చరణ్ ఫేస్ వ్యాల్యూను ఈ సంస్థ రూ. కోటిగా నిర్ణయించిందన్నమాట.
ఇక 'ఎవడు' సినిమా వివరాల్లోకి వెళితే....ఈ రోజు సాయంత్రం చిక్కడపల్లి సెంటర్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్యా థియేటర్లో 'ఎవడు' థియేటర్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరువుతున్నారు. రామ్ చరణ్ వస్తున్నాడనే సమాచారం తెలియడంతో అభిమానులు భారీగా ఈ థియేటర్ వద్దకు చేరుకున్నారు.
రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కించిన చిత్రం 'ఎవడు'. దిల్ రాజు మాట్లాడుతూ...'ఎవడు' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నాం. దీనికి సంబంధించిన స్పెషల్ టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది' అన్నారు.
ఈ చిత్రంలో జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయికుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ : వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు : అబ్బూరి రివి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్: సెల్వం, ఆర్ట్ : ఆనంద్ సాయి. సహ నిర్మాతలు: శిరీష్ లక్ష్మణ్, నిర్మాత: రాజు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications












