మారుతి టీం వర్క్స్ ‘క్లోజ్ ఫ్రెండ్స్’ (ప్రమోషన్ సాంగ్)

By Bojja Kumar

హైదరాబాద్: నందు, మధునందన్, మధురిమ, షామిలి సౌందర్యరాజన్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘క్లోజ్ ఫ్రెండ్స్'. సినిమా లవర్స్ సినిమా పతాకంపై మారుతి టీమ్‌వర్క్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈచిత్రం ప్రమోషనల్ సాంగ్‌ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో శుక్రవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ- మలయాళ కథను ఆధారం చేసుకొని రూపొందించిన ఈ చిత్రం తెలుగులో సరికొత్త జోనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఓ మంచి సినిమా అందిస్తున్నామన్న సంతోషంతో ఉన్నామని తెలిపారు.

 Close Friends movie Promotional Song

ఓ ప్రయాణంలో స్నేహితులమధ్య అనుబంధం ఎలా సాగిందీ అనే అంశాన్ని వైవిధ్యంగా, స్క్రీన్‌ప్లే ప్రధానంగా రూపొందించారు. జె.బి. ఇచ్చిన సంగీతం, టెక్నికల్‌గా ఈ చిత్రం హైలెట్‌గా ఉంటుందని, నవంబర్‌లో ‘కాయ్‌రాజా కాయ్' విడుదలైతే ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మారుతి తెలిపారు.

కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. అభిషేక్ మహర్షి, నవీద్, సప్తగిరి, కుమార్ సాయి, తా.రమేష్, సూర్య, మధురిమ, షామిలి, భార్గవి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:విశ్వ డి.బి., సంగీతం:జె.బి., ఆర్ట్:గోవింద్, ఎడిటింగ్:ఉద్ధవ్, నిర్మాత: కుమార్ అన్నంరెడ్డి, రచన, దర్శకత్వం:అరుణ్ పవార్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X