twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్ని ధియోటర్స్ మూసేయండి: మోహన్ బాబు

    By Srikanya
    |

    ఆంధ్రాలోనూ నా సినిమాలను ఆపేయమని ఎగ్జిబిటర్లకు చెప్పండి. ఇదేదో మోహన్ బాబు ఒక్కడి సమస్య అనుకున్న పరిశ్రమ వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరుచుకోండి. నిన్న నా కూతురు అయింది. ఇవాళ బన్నీ బాబు అయ్యాడు. రేపు మీ వంతు రాబోతోంది' అంటూ మోహన్ బాబు విరుచుకుపడ్డారు. 'వరుడు' సినిమా షూటింగ్ ను బుధవారం ఉదయం తెరాస, ఎబివిపి శ్రేణులు అడ్డుకుని యూనిట్ ను భయభ్రాంతులను చేసి విధ్వంసం సృష్టించిన ఘటనపై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.'మొన్న నా సినిమాలను అడ్డుకుని ఆపేయించారు. ఎగ్జిబిటర్లు థియేటర్లు మూసేశారు. నిన్న నా సినిమా షూటింగ్ పైనా దాడి చేశారు. అయినా ఫరవాలేదు. ఒకటే చెప్పదలచుకున్నాను. ఇక్కడే ఎందుకు మూసేయాలి? అని ఆయన ప్రశ్నించారు.

    అలాగే మా ఎందుకు సైలెంట్ గా ఉంటోందో ఈ విషయమై నాకు అర్ధం కావటం లేదు. లక్ష్మీప్రసన్న షూటింగ్ చేస్తున్న ప్రాంతంలో విధ్వసం జరిగినప్పుడు ఆ ఇంటి పక్కనే ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కనీసం స్పందించక పోవడం విడ్డూరమని అన్నారు. మనోజ్ సంఘటన అప్పుడే ఏదైనా యాక్షన్ తీసుకుని ఉంటే ఈ రోజు బన్నీ షూటింగ్ విషయంలో ఇలా జరిగేది కాదు. అయినా తెలంగాణాలోనే ధియోటర్స్ ఎందుకు క్లోజ్ చేయాలి. ఆంధ్రా అంతటా ధియోటర్స్ క్లోజ్ చేయండి. నేను మా ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయమై ఓ ఎమర్జన్సీ మీటింగ్ ఎరేంజ్ చేయండి. అలాగే బన్నీ తన కుమారుడు వంటి వాడనీ, అలాగే మనోజ్-లక్ష్మీప్రసన్న షూటింగ్ పై జరిగిన దాడిని చిరంజీవి ఖండించడం తనకెంతో సంతోషంగా ఉందనీ అన్నారు. ఇప్పటికైనా ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 'మా' స్పందించకుండా ఎవరికి వారే అన్నట్టు ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X